రైతు చట్టాల ప్రతులను తగులబెడతాం, ఇవే మాకు చలిమంటలు,అన్నదాతల హెచ్ఛరిక..ఇక ఆందోళన ఉధృతికే నిర్ణయం

రైతు చట్టాల ప్రతులను తగులబెడతామని రైతు సంఘాలు హెచ్ఛరించాయి. ఇవే తమకు చలిమంటలవుతాయన్నారు. ఉత్తరాదిన లోహ్రి పేరిట..

  • Umakanth Rao
  • Publish Date - 12:49 pm, Wed, 13 January 21

రైతు చట్టాల ప్రతులను తగులబెడతామని రైతు సంఘాలు హెచ్ఛరించాయి. ఇవే తమకు చలిమంటలవుతాయన్నారు. ఉత్తరాదిన లోహ్రి పేరిట వీరు ప్రతి జనవరి 13 న ఇలా ఒకవిధంగా భోగి పండుగ జరుపుకుంటారు. ఈ సారి ఇలా చట్టాల ప్రతులను దగ్ధం చేస్తామని,  దేశంలోని వివిధ సైట్లలో ఈ విధమైన నిరసన వ్యక్తం చేస్తామన్నారు. కాగా సుప్రీంకోర్టు రూలింగ్ ని కూడా పట్టించుకోకుండా పెద్ద సంఖ్యలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నాయి. విపరీతమైన చలిని సైతం లెక్క చేయకుండా అన్నదాతలు ఇక్కడికి చేరుకుంటున్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. అటు-అత్యున్నత న్యాయస్థానం సూచించిన కమిటీ తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతం కాదని మళ్ళీ రైతు సంఘాలు పేర్కొన్నాయి.

Also Read:

ఆలయాలను ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదు.. కుల, మతాలకు అతీతంగా చర్యలు తీసుకుంటామన్న డీజీపీ..

మహారాష్ట్ర మంత్రిపై రేప్ అభియోగం, తోసిపుచ్చిన మినిస్టర్, కేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ మహిళా విభాగం డిమాండ్

Jangaon Tension : టెన్షన్.. టెన్షన్.. జనగామకు బండి సంజయ్.. భారీగా పోలీసుల మోహరింపు