నిసర్గ తుపాను: ఆ మూడు రాష్ట్రాలకు హై అలర్ట్..!

| Edited By:

Jun 02, 2020 | 7:43 PM

అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుపాను ముంచుకొస్తోంది. జూన్ 3 సాయంత్రానికి ఈ తుపాను పలు ఉత్తరాది రాష్ట్రాల తీరాలను తాకొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, గోవా తీరాలపై నిసర్గ తుపాను విరుచుకుపడనుందనే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ఇక తుపానుపై మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. […]

నిసర్గ తుపాను: ఆ మూడు రాష్ట్రాలకు హై అలర్ట్..!
Follow us on

అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుపాను ముంచుకొస్తోంది. జూన్ 3 సాయంత్రానికి ఈ తుపాను పలు ఉత్తరాది రాష్ట్రాల తీరాలను తాకొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, గోవా తీరాలపై నిసర్గ తుపాను విరుచుకుపడనుందనే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ఇక తుపానుపై మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సైతం తుపాను పరిస్థితులపై సమీక్ష జరిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాని ఆయన అన్నారు. మరోవైపు మహారాష్ట్ర, డయ్యూడామన్‌, గుజరాత్‌కు చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Read This Story Also: Breaking: ఇకపై వారికి ప్రత్యేక పాసులు అవసరం లేదు: తెలంగాణ పోలీసులు