Supreme Court: తెలంగాణ అడ్వకేట్‌కు అరుదైన గౌరవం.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నిరూప్‌ నియామకం

తెలంగాణ న్యాయవాదికి అరుదైన గౌరవం దక్కింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా పి. నిరూప్‌ నియమితులయ్యారు.

Supreme Court: తెలంగాణ అడ్వకేట్‌కు అరుదైన గౌరవం.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నిరూప్‌ నియామకం
Advocate Niroop
Follow us

|

Updated on: Dec 11, 2021 | 4:33 PM

Supreme Court Senior Advocate Niroop Reddy: తెలంగాణ న్యాయవాదికి అరుదైన గౌరవం దక్కింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా పి. నిరూప్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. హైదరాబాద్‌కు చెందిన పి నిరూప్‌ను సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది గా ప్రకటించారు. వీరు ప్రముఖ న్యాయవాది, మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి రామచంద్రారెడ్డి కుమారుడు. నిరూప్ రెడ్డి తెలంగాణ నుండి సుప్రీం కోర్టు గుర్తించిన మొదటి సీనియర్ న్యాయవాది కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రం నుండి అపెక్స్ కోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

8 డిసెంబర్ 2021న ఫుల్ కోర్ట్ అతన్ని సీనియర్ అడ్వకేట్‌గా నియమించింది. సుప్రీం కోర్టు న్యాయవాదిగా 30 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. 31 జాతీయ ప్రాముఖ్యత కలిగిన సున్నితమైన విషయాలపై, ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా, ఎన్విరాన్‌మెంటల్ లా, ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ లా, ల్యాండ్ రంగాలలో 31 తీర్పులను నివేదించారు. ముఖ్యంగా వ్యవసాయ చట్టాలు, రాజ్యాంగ చట్టాలపై సుదీర్ఘ వాదనలు వినిపించారు. అత్యున్నత న్యాయస్థానంలో 3 దశాబ్దాలుగా ప్రాక్టీస్ చేసిన నిరూప్‌కు ఈ హోదా లభించింది. మాజీ అడ్వకేట్-జనరల్, ఆంధ్ర ప్రదేశ్, అదనపు సొలిసిటర్-జనరల్ ఆఫ్ ఇండియా V.R.రెడ్డి, మాజీ సొలిసిటర్-జనరల్ ఆఫ్ ఇండియా గోపాల్ సుబ్రమణ్యం వద్ద ఆయనకు సుదీర్ఘం పని చేసిన అనుభం ఉంది. 2013-2016 సంవత్సరాల్లో సుప్రీంకోర్టులో గోవా రాష్ట్రానికి, ఢిల్లీలోని ఇతర ఫోరలకు వారి సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌ న్యాయవాదిగా కూడా పని చేశారు. ఢిల్లీ, షిల్లాంగ్‌లో మేఘాలయ రాష్ట్రానికి అదనపు అడ్వకేట్-జనరల్‌గా కూడా పనిచేశారు.

సంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి కుమారుడు నిరూపకాబట్టి పి.నిరూప్. తన తండ్రి వృత్తిపరమైన వారసత్వాన్ని కొనసాగించడానికి ముఫోసిల్ కోర్టులో తొలి ప్రస్థానం ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ..ఢిల్లీలోని అపెక్స్ కోర్టు వరకు సుదీర్ఘ ప్రయాణం సాగించారు. చట్టంలోని వివిధ శాఖలకు, ముఖ్యంగా చట్టపరమైన అభివృద్ధి, సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన చట్టం విస్తృతమైన వాదనలను వినిపించే మరింత వెలుసుబాటు ఆయనకు దగ్గనుంది.

Read Also… మీ వాట్సాప్‌కి ఇలాంటి మెస్సేజ్‌లు వచ్చాయా.. ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త.. చూసుకోండి..