తొలి రోజున దాదాపు రెండు లక్షల మందికి వ్యాక్సినేషన్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో నమోదైన మైనర్ అస్వస్థత కేసులు.

| Edited By: Pardhasaradhi Peri

Jan 17, 2021 | 9:39 AM

దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన తొలిరోజున సుమారు రెండు లక్షలమంది టీకామందు తీసుకున్నారు. 1,91,181 మంది హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు తొలి డోసు..

తొలి రోజున దాదాపు రెండు లక్షల మందికి వ్యాక్సినేషన్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో నమోదైన మైనర్ అస్వస్థత కేసులు.
Follow us on

Covid Vaccine :దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన తొలిరోజున సుమారు రెండు లక్షలమంది టీకామందు తీసుకున్నారు. 1,91,181 మంది హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఆరోగ్య  శాఖ వెల్లడించింది. 16,755 మంది సిబ్బంది 3,352 సెంటర్లలో వీరికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇండియన్ ఆర్మీ,  నేవీ విభాగాల్లో 3,429 మంది సిబ్బంది కూడా టీకామందు తీసుకున్నారు. సీరం సంస్థ వారి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని అన్ని రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాలూ వినియోగించుకోగా, భారత్ బయోటెక్ కంపెనీ వారి కోవాగ్జిన్ టీకామందును  12 రాష్టాలు వినియోగించుకున్నాయి. ఇక ఢిల్లీలో 51 మైనర్ కేసులు, రాజస్థాన్ లో 21 అస్వస్థత కేసులు నమోదయ్యాయి. ఒక్కో డోసుకు మధ్య సుమారు నెల రోజుల వ్యవధి ఉండాలని నిపుణులు ఇదివరకే సూచించారు.

ప్రపంచంలోనే ఈ అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిన్న లాంచ్ చేయడంపట్ల పలు దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే ఇండియాను ప్రశంసించింది. ఇతర దేశాలకు ఇండియా ఆదర్శం కావాలని సూచించింది. అలాగే బిలియనీర్  బిల్ గేట్స్ సైతం కోవిడ్ పై పోరులో భారత దేశ కృషిని కొనియాడారు. ప్రధాని మోదీని ఆయన అభినందించారు.

AlsoRead:

ముగిసిన మెట్రో గోల్డెన్ ఆఫర్.. రాయితీ నిలుపుదల.. మరోసారి పొడిగించాలంటూ ప్రయాణికుల డిమాండ్.!!

ఆ పానెల్ లోని ఇతర సభ్యులను తొలగించండి, సుప్రీంకోర్టును కోరిన రైతు సంఘం, అఫిడవిట్ సమర్పణ

బిగ్‏బాస్ టాలెంట్ మేనేజర్ పిస్తా ధాకడ్ మృతి.. సంతాపం వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు, బిబి మాజీ కంటెస్టెంట్స్..