National Coronavirus Updates : దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా తీవ్రత.. కొత్తగా 15,968 మందికి కోవిడ్ పాజిటివ్

|

Jan 13, 2021 | 12:52 PM

దేశవ్యాప్తంగా కొత్తగా 15,968 మందికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయ్యిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

National Coronavirus Updates : దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా తీవ్రత.. కొత్తగా 15,968 మందికి కోవిడ్ పాజిటివ్
Follow us on

National Coronavirus today Updates : దేశంలో ఓ పక్క కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 15,968 మందికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయ్యిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,04,95,147కు చేరింది. ఇక, మంగళవారం కొత్తగా 17,817 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక, ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 1,01,29,111 కోలుకున్నారని కేంద్ర వెల్లడించింది. కాగా, మంగళవారం ఒక్కరోజే 202 మంది కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా వైరస్ కారణంగా మృతి చెందిన వారిసంఖ్య 1,51,529కు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,14,507 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది. ఇదిలావుంటే, దేశంలో మంగళవారం ఒకే రోజు 8,36,227 నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ చెప్పింది. ఇప్పటి వరకు 18,34,89,114 శాంపిల్స్‌ టెస్ట్‌ చేసినట్లు వివరించింది.

Read Also…. Covid Vaccine ready : మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు అంతా సిద్ధం.. భారీ బందోబస్తు మధ్య కరోనా టీకా తరలింపు