Bullet train: బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు.. ప్రారంభమైన పనులు..!

|

Oct 04, 2021 | 8:18 AM

Bullet train: బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుకు మరో ముందుడుగు పడింది. ముంబై - అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌ ప్రాజెక్టులో మరో కీలక అడుగు వేసింది. నేషనల్‌ హై..

Bullet train: బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు.. ప్రారంభమైన పనులు..!
Follow us on

Bullet train: బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుకు మరో ముందుడుగు పడింది. ముంబై – అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌ ప్రాజెక్టులో మరో కీలక అడుగు వేసింది. నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ సంస్థ(ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) గుజరాత్‌లోని నవ్సారి సిటీలో అక్టోబర్‌ 2న బుల్లెట్‌ ట్రైన్‌ తొలి క్యాస్టింగ్‌ యార్డ్‌ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.

508 కిలోమీటర్ల ట్రాక్‌ నిర్మాణం..

ముంబై నుంచి ఢిల్లీ మధ్య మొత్తం 508 కిలోమీటర్ల నిడివితో పూర్తిగా వయడక్టు పద్దతిలో బుల్లెట్‌ ట్రైన్‌ ట్రాక్‌ నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఈ నిర్మాణ పనులను ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ పర్యవేక్షిస్తుంది. తాజాగా ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా 11.90 నుంచి 12.4 మీటర్ల పొడవు, 2.1 నుంచి 2.5 మీటర్ల వెడల్పు, 3.40 మీటర్ల లోతు, 60 వేల కిలోల బరువైన క్యాస్టింగ్‌ యార్డ్‌ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ తరహాలో మొత్తం 19(సెగ్మెంట్స్‌) క్యాస్టింగ్‌ యార్డ్‌లను తయారు చేయాల్సి ఉంటుంది. ఈ బుల్లెట్‌ రైలుకు సంబంధించి నిర్మాణాలను చేపట్టలేని పిల్లర్స్‌, ట్రాకులు,బ్రిడ్జ్‌లను మరో ప్రాంతంలో విడివిడిగా నిర్మిస్తారు. తర్వాత పెద్ద పెద్ద పొక్లెయిన‍్ల సాయంతో తరలించి అవసరమైన ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. అలా ఈ బుల్లెట్‌ ట్రైన్‌ నిర్మాణాల్ని సెగ్మెంట్స్‌గా విభజించి నిర్మిస్తున్నారు

హైదరాబాద్‌ టు ముంబై:

అలాగే హైదరాబాద్ టు ముంబై బుల్లెట్ ట్రైన్ కూడా త్వరలో రాబోతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కేవలం మూడున్నర గంటల్లోనే హైదరాబాద్‌ నుంచి ముంబై చేరుకోవచ్చు. రెండు నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ రాకపోకలు త్వరలో సాగించనుంది. బుల్లెట్‌ రైలు ప్రారంభించేందుకు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NHSRCL‌) ప్రతిపాదించింది. నవంబర్‌ 5న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-బిడ్‌ సమావేశం నిర్వహించనుంది. నవంబర్ 18న టెండర్లు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌ – ముంబై ప్రయాణంలో 9.5 గంటల సమయం ఆదా కానుంది. ప్రస్తుతం రెండు నగరాల మధ్య హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తోంది. ఈ రైలు ముంబై చేరకునేందుకు 14 గంటల సమయం పడుతుంది.

 

ఇవీ కూడా చదవండి:

Google Pay: ఆ సేవలపై వెనుకడుగు వేస్తున్న గూగుల్‌ పే.. ఇలా అయితే బ్యాంకులకు నష్టమే..!

PM Kisan: మోదీ ప్రభుత్వం రైతుల కోసం మరో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో రైతులు చేరితే రూ.15 లక్షలు!