Piyush Goyal: కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వం.. ఎలాంటి వివక్ష లేదన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్..

|

Mar 24, 2022 | 4:48 PM

అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి రా వరి సేకరణ జరుగుతోందని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ వెల్లడించారు. కేసీఆర్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు.

Piyush Goyal: కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వం.. ఎలాంటి వివక్ష లేదన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్..
Piyush Goyal
Follow us on

అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి రా వరి సేకరణ జరుగుతోందని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​(Minister Piyush Goyal) వెల్లడించారు. కేసీఆర్‌ ప్రభుత్వం(Telangana Govt) రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు. రా రైస్‌ కేంద్రానికి ఎంత ఇస్తారని ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదని.. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు రా రైస్‌ ఎంత ఇస్తాయో చెప్పాయని కేంద్ర మంత్రి వివరించారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి ముడి బియ్యం సేకరణ చేస్తున్నామని అన్నారు.  ముడి బియ్యం కేంద్రానికి ఎంత ఇస్తారని ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదన్నారు. తెలంగాణ తప్ప అన్ని రాష్ట్రాలు ముడి బియ్యం ఎంత ఇస్తాయో చెప్పాయన్నారు. ఒప్పందం ప్రకారమే ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని వెల్లడిచారు. తెలంగాణ పట్ల మాకు ఎలాంటి వివక్ష లేదని అన్నారు.

ధాన్యం కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్. రా రైస్ ఎంత ఇచ్చినా కొంటామన్నారు. అన్ని రాష్ట్రాల్లో సేకరిస్తున్నట్టే.. తెలంగాణ నుంచి కూడా రా రైస్‌ సేకరిస్తామన్నారు. పంజాబ్‌ తరహా తెలంగాణలో కూడా సేకరిస్తామని స్పష్టం చేశారు. రా రైస్‌ ఎంత ఇస్తామనే విషయం.. ఇంత వరకు తెలంగాణ ప్రభుత్వం చెప్పలేదు. అన్ని రాష్ట్రాలు వివరాలు ఇచ్చినా.. తెలంగాణ మాత్రం ఇంతవరకు ఇవ్వలేదంటోంది కేంద్రం.

పంజాబ్‌ తరహా తెలంగాణలో కూడా సేకరిస్తామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 25న అన్ని రాష్ట్రాలను పిలిచి.. ఎంత ధాన్యం ఇస్తారో అడిగాం.. ఏపీ కూడా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇస్తామని చెప్పింది. కానీ తెలంగాణ ఎలాంటి సమాచారం రాలేదన్నారు.

ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ పట్ల తమకు ఎలాంటి వివక్ష లేదన్నారు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు మండిపడ్డారు. తెలంగాణ రైతులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి పియూష్.

తెలంగాణ నేతలు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను అక్కడి ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది అన్నారు. తెలంగాణ రైతులకు బాసటగా ఉంటామని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్ హామీ ఇచ్చారు.

అంతకుమందు.. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో గోయల్‌ను కలిసిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్​, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్​కుమార్​, తెరాస ఎంపీలు కలిశారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రమంత్రి పీయూష్​గోయల్​ను కోరారు.

 


ఇవి కూడా చదవండి: Dental Health: మీ దంతాలు తెల్లగా మెరిసిపోవాలంటే.. వీటిని తప్పకుండా తినండి..

Storing Bananas: అరటిపండ్లు త్వరగా కుళ్ళిపోతున్నాయా.. ఈ చిట్కాలను పాటించండి..