Maharashtra: నేను ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదు.. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిండే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Jul 04, 2022 | 5:22 AM

మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి పీఠం దక్కడంపై ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిండే స్పందించారు. బీజేపీ (BJP) లీడర్ దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నట్లు తాను భావించానని, కానీ యాధృచ్ఛికంగా ఆ పదవి తనకు దక్కిందని అన్నారు...

Maharashtra: నేను ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదు.. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిండే ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Eknath Shinde
Follow us on

మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి పీఠం దక్కడంపై ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిండే స్పందించారు. బీజేపీ (BJP) లీడర్ దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నట్లు తాను భావించానని, కానీ యాధృచ్ఛికంగా ఆ పదవి తనకు దక్కిందని అన్నారు. మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పదవి ఎన్నిక సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న నేతలే ఇప్పటివరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాయన్న శిండే.. ఈసారి ప్రభుత్వంలో ఉన్న నేతలే ప్రతిపక్షంగా మారారని వ్యాఖ్యానించారు. మంత్రులతో సహా చాలా మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి బయటకు రావడం మామూలు విషయం కాదన్నారు. బాలాసాహెబ్ ఠాక్రే ఆనంద్ డిఘేల భావజాలానికి అంకితమైన తన లాంటి సాధారణ కార్యకర్తకు ఇది చాలా పెద్ద విషయమని చెప్పారు. కాగా.. రెబల్ ఎమ్మెల్యేలలో కొంతమంది తనతో కాంటాక్ట్ లో ఉన్నట్లు మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కొందరు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని చెప్పిన ఉద్ధవ్.. ఆ సంఖ్యను 5, 10, 20, 25 ఇలా పెంచుకుంటూ పోయారు. కానీ, అదంతా తప్పని నిరూపించామని స్పష్టం చేశారు.

బీజేపీకి 115 ఎమ్మెల్యేలుండగా, నాకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. దీంతో సీఎం పదవి నాకు దక్కుతుందని ఊహించలేదు. కానీ బీజేపీ మాత్రం నన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టింది. ఇందుకు ప్రధాని మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డాలకు కృతజ్ఞలు తెలుపుతున్నా. బాలాసాహెబ్‌ ఠాక్రే భావజాలానికి అనుకూలంగా ఇప్పుడు బీజేపీ-శివసేన ప్రభుత్వం ఏర్పడింది.

     ఏక్‌నాథ్‌ శిండే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం. ఊహించని విధంగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేను సీఎంగా కన్పామ్ చేశారు బీజేపీ నేత ఫడ్నవీస్. ఆయనకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. తాను ప్రభుత్వానికి దూరంగా ఉండనున్నట్లు మరో సంచలన వార్త చెప్పారు. ఇప్పటివరకు ఫడ్నవీస్ అవుతారంటూ.. ఏకనాథ్ షిండే డిప్యూటీ సీఎం అవుతారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో షిండే పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి