బ్రేకింగ్: మధ్య ప్రదేశ్ గవర్నర్ మృతి.. ప్రధాని సంతాపం..

| Edited By:

Jul 21, 2020 | 10:20 AM

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్(85) కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళ వారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అశుతోష్ టండన్ ట్విట్టర్ ద్వారా..

బ్రేకింగ్: మధ్య ప్రదేశ్ గవర్నర్ మృతి.. ప్రధాని సంతాపం..
Follow us on

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్(85) కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళ వారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అశుతోష్ టండన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తీవ్ర అనారోగ్యానికి గురైన లాల్జీ టండన్‌ను ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచారు. అయినప్పటికీ గవర్నర్ లాల్జీ ఆరోగ్యం మెరుగుపడలేదు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందారు. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, మధ్య ప్రదేశ్ ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అలాగే గవర్నర్ లాల్జీ టండన్ మరణ వార్త విన్న పలువురు రాజకీయ నాయకులు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Read More: 

కరోనా ట్రీట్‌మెంట్ విషయంపై ఏపీ ప్రభుత్వ కీలక మార్గదర్శకాలు..

ఏపీ మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారు.. మంత్రులెవరంటే?