Central Cabinet: భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు తేజస్‌ ఫైటర్‌ జెట్లు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

|

Jan 13, 2021 | 7:09 PM

Central Cabinet: భద్రతా వ్యవహారాలపై కేంద్ర కేబినెట్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.48వేల కోట్లతో 83 తేజస్‌ ఫైటర్‌ జెట్‌లు సమకూర్చాలని నిర్ణయం తీసుకుంది...

Central Cabinet: భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు తేజస్‌ ఫైటర్‌ జెట్లు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Follow us on

Central Cabinet: భద్రతా వ్యవహారాలపై కేంద్ర కేబినెట్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.48వేల కోట్లతో 83 తేజస్‌ ఫైటర్‌ జెట్‌లు సమకూర్చాలని నిర్ణయం తీసుకుంది. భారత వైమానికి దళాన్ని బలోపేతం చేసేందుకే తేజస్‌ ఫైటర్‌ జెట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేబినెట్‌ కమిటీ నిర్ణయించింది.

అయితే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన హెలికాప్టర్లు, ఎస్‌సీఐ తేజస్‌ యుద్ధ విమానాలు, డ్రోన్లను రక్షణ శాఖ అందజేయనుంది. బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్‌ కమిటీ పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. కాగా, భారత వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేసేందుకు ముందుకు సాగుతోంది. దేశ రక్షణ చర్యల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది కేంద్రం. ఇప్పటికే యుద్ధ విమానాలు, తదితర రక్షణ శాఖకు చెందిన పరికరాలు సమకూర్చింది. రక్షణ శాఖను మరింత బలోపేతం చేసే దిశగా తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది.

Two Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. మరో రెండు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే

WHO Team Wuhan Visit: 14న కరోనా పుట్టినిల్లు వూహాన్‌లో పర్యటించనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం