WHO Team Wuhan Visit: 14న కరోనా పుట్టినిల్లు వూహాన్‌లో పర్యటించనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం

WHO Team Wuhan Visit: కరోనా పుట్టినిల్లు ఘనకార్యాన్ని ముటగట్టుకున్న చైనాలోని వూహాన్‌ నగరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం జనవరి 14న ...

WHO Team Wuhan Visit: 14న కరోనా పుట్టినిల్లు వూహాన్‌లో పర్యటించనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం
Follow us

|

Updated on: Jan 13, 2021 | 6:25 PM

WHO Team Wuhan Visit: కరోనా పుట్టినిల్లు ఘనకార్యాన్ని ముటగట్టుకున్న చైనాలోని వూహాన్‌ నగరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం జనవరి 14న పర్యటించనుంది. వూహాన్‌ కేంద్రంగా కరోనా మహమ్మారి పుట్టుక, ఇన్ఫెక్షన్‌ వ్యాప్తికి దారి తీసిన కారణాలనే డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం అన్వేషించనుంది. పది మంది సభ్యులతో కూడిన ఈ నిపుణుల బృందం క్షేత్ర స్థాయిలో పూర్తి వివరాలు సేకరించనుంది.

కాగా, ఇప్పటికే చాలా దేశాలు కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించినప్పటికీ, ఈ ఏడాదిలో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యం కాకపోవచ్చని డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథ్‌ అభిప్రాయపడ్డారు. అయితే గతంలో కూడా డబ్ల్యూహెచ్‌వో బృందం వూహాన్‌ నగరాన్ని సందర్శించి కరోనా వైరస్‌పై వివరాలు సేకరించింది. తాజాగా మరోమారు అక్కడికి వెళ్లి వైరస్‌పై అధ్యయనం చేయనుంది.

వూహాన్‌లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. ఈ వైరస్‌ బారిన ఎందరో ప్రాణాలు వదిలారు. ఈ వైరస్‌ వూహాన్‌ నుంచే మొదలు కావడంతో ప్రపంచ దేశాలు సైతం దుమ్మెత్తిపోశాయి. ఐక్యరాజ్య సమితి సైతం చివ్వట్లు పెట్టింది. చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సైతం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైరస్‌ విషయంలో చైనాపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వైరస్‌ వల్ల ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం అవుతోంది. చైనా వల్ల తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సిన వచ్చింది. ఇప్పటికే ఇంకా దేశాలు కోలుకోలేకపోతున్నాయి. వైరస్‌ కారణంగా చైనాకు తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి  పరిస్థితి ఎదురైంది.

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న 14 రోజుల తర్వాతే దాని ప్రభావం మొదలవుతుంది: కేంద్ర ఆరోగ్యశాఖ