Kerala HC: మద్యం వాసన వస్తే ఆ వ్యక్తి మత్తులో ఉన్నాడని కాదు.. కేరళ హైకోర్టు కీలక తీర్పు

|

Nov 16, 2021 | 8:17 PM

ప్రజలకు ఎలాంటి నష్టం జరగనంత వరకు ప్రైవేట్‌ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం కాదని కేరళ హైకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. కేవలం మద్యం వాసనతో..

Kerala HC: మద్యం వాసన వస్తే ఆ వ్యక్తి మత్తులో ఉన్నాడని కాదు..  కేరళ హైకోర్టు కీలక తీర్పు
Mere Smell Of Alcohol Does
Follow us on

ప్రజలకు ఎలాంటి నష్టం జరగనంత వరకు ప్రైవేట్‌ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం కాదని కేరళ హైకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. కేవలం మద్యం వాసనతో ఆ వ్యక్తి మత్తులో ఉన్నాడని అర్థం కాదని కోర్టు పేర్కొంది. జస్టిస్ సోఫీ థామస్ చేసిన ఏకగ్రీవ విచారణ విచారణను రద్దు చేసింది. కేవలం మద్యం వాసన వచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి మత్తులో ఉన్నట్లు కాదని కేరళ హైకోర్టు పేర్కొంది. అంతే కాదు ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగనంత వరకు అది నేరంగా పరిగణించబడదని కేరళ హైకోర్టు సోమవారం తీర్పునిచ్చినట్లు బార్ అండ్ బెంచ్ నివేదించింది. ప్రయివేటు ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల ఇతరులకు ఇబ్బంది లేకుంటే సమస్యలేదని వెల్లడించింది. కేవలం మద్యం వాసన వస్తే ఆ వ్యక్తి మత్తులో ఉన్నాడని అర్థం కాదని కోర్టు పేర్కొంది.

జస్టిస్ సోఫీ థామస్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ పిటిషనర్‌పై విచారణను రద్దు చేసింది. ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశంలో మద్యం మత్తులో లేదా అల్లర్లకు పాల్పడే స్థితిలో కనిపిస్తాడని.. అతనిపై కేసులు నమోదు చేయడం సరికాదని తెలిపింది.

జస్టిస్ సోఫీ థామస్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ పిటిషనర్‌పై విచారణను రద్దు చేసింది. ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశంలో మద్యం మత్తులో లేదా అల్లర్లకు పాల్పడే స్థితిలో కనిపిస్తాడని.. అతనిపై కేసులు బుక్ వీలు లేదని తెలిపింది.

ఈ విషయాన్ని నిరూపించడానికి బ్లాక్స్ లా డిక్షనరీ ప్రకారం ‘మత్తు’ నిర్వచనాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. మత్తు నిర్వచనం ఇలా చెబుతోంది: “మద్యం లేదా మాదకద్రవ్యాల వినియోగం కారణంగా పూర్తి మానసిక, శారీరక సామర్థ్యాలతో వ్యవహరించే సామర్థ్యం తగ్గిపోతుంది.. దానినే మద్యం తాగుడు.” అని అంటారని వివరించింది కోర్టు.

పిటిషనర్‌పై కేరళ పోలీస్ చట్టంలోని సెక్షన్ 118(ఎ) కింద మద్యం మత్తులో పోలీస్ స్టేషన్‌కు హాజరైనందుకు కేసు నమోదు చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పు చెప్పింది. నిందితుడిని గుర్తించడం కోసం తనను పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించారని.. అలా చేయడంలో విఫలమైనందుకు పోలీసులు అతనిపై తప్పుడు కేసు నమోదు చేశారని న్యాయవాదులు ఐవి ప్రమోద్, కెవి శశిధరన్, సైరా సౌరజ్ వాదించారు. ఈ సందర్భంలో మత్తు అనే పదంపై చర్చ జరిగింది.

ఇవి కూడా చదవండి: CM KCR: రైతు దీక్షకు సీఎం కేసీఆర్‌..? కేంద్రంతో అమీతుమీకి సిద్ధమైన గులాబీ దళం..

Onion Face Pack: ఉల్లిపాయ ఫేస్‌ప్యాక్.. ఇలా చేస్తే తళుక్కుమనే అందం మీ సొంతం..