MUDA Scam: ముడా స్కాం: సీఎం ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి.. న్యాయ నిపుణులతో సిద్ధరామయ్య

|

Aug 17, 2024 | 11:28 AM

ముడా స్కాం కర్ణాటక సర్కార్‌ను కుదిపేస్తోంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA)లో జరిగిన కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఎట్టకేలకు అనుమతి ఇచ్చారు.

MUDA Scam: ముడా స్కాం: సీఎం ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి.. న్యాయ నిపుణులతో సిద్ధరామయ్య
Siddaramaiah
Follow us on

ముడా స్కాం కర్ణాటక సర్కార్‌ను కుదిపేస్తోంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA)లో జరిగిన కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఎట్టకేలకు అనుమతి ఇచ్చారు. దీంతో సీఎం సిద్ధరామయ్య న్యాయ పోరాటంపై సమాలోచనలు చేస్తున్నారు. ప్రాసిక్యూషన్‌కు ఇచ్చిన ఉత్తర్వుల అధికారిక కాపీ ఇంకా సీఎంకు చేరలేదు. అందిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై న్యాయ నిపుణులతో సీఎం సిద్దరామయ్య చర్చలు జారుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కావేరి నివాసంలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య న్యాయపరమైన అవకాశాలపై సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రాసిక్యూషన్‌కు వ్యతిరేకంగా ఆయన కోర్టుకు వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షాలినీ రజనీష్, ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ శరత్ చంద్రతో చర్చలు జరుపుతున్నారు. ప్రాసిక్యూషన్‌కు అనుమతి, తీసుకోవాల్సిన చర్యలపై సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – ముడాలో భూములు కోల్పోయిన వారికి సైట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని.. 4వేల కోట్ల కుంభకోణం దీనివెనుక దాగి ఉందని ఆరోపణలు వచ్చాయి. స్వయంగా సీఎం సిద్ధరామయ్య భార్యకు అప్పనంగా భూములు ఇచ్చేశారంటూ విపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు. ముడా స్కాం ఆరోపణలపై రిటైర్డ్‌ జడ్జ్‌తో విచారణకు ఆదేశించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. పీఎన్‌ దేశాయ్‌ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతుంది.

ఈ నేపథ్యంలోనే మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో భూ కుంభకోణంలో సీఎంని విచారించేందుకు కర్నాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17, భారత న్యాయసంహితలోని సెక్షన్‌ 18 ప్రకారం దర్యాప్తు అధికారులకు ముఖ్యమంత్రిని విచారించేందుకు రంగం సిద్ధం అవుతోంది. మరోవైపు గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్‌ చేయడానికి సిద్ధరామయ్య లీగమ్‌ టీమ్‌ రెడీ అవుతోంది. అయితే గవర్నర్‌ థావర్‌చంద్‌పై కాంగ్రెస్‌ మంత్రుల విమర్శలు గుప్పించారు. గవర్నర్‌ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..