MLA Remove Shirt : అసెంబ్లీలో చొక్కా విప్పిన ఎమ్మెల్యే.. సప్పెండ్ చేసిన స్పీకర్.. ఇది ఎక్కడ జరిగిందంటే..

|

Mar 05, 2021 | 2:18 PM

MlA Remove Shirt In Assembly: అసెంబ్లీలో ప్రతిపక్ష, అధికార పక్షాల నడుమ మాటల యుద్ధం సర్వసాధారణమే. అయితే ఒక్కోసారి ఇవి శృతి మించుతుంటుంది. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే..

MLA Remove Shirt : అసెంబ్లీలో చొక్కా విప్పిన ఎమ్మెల్యే.. సప్పెండ్ చేసిన స్పీకర్.. ఇది ఎక్కడ జరిగిందంటే..
Follow us on

MLA Remove Shirt In Assembly: అసెంబ్లీలో ప్రతిపక్ష, అధికార పక్షాల నడుమ మాటల యుద్ధం సర్వసాధారణమే. అయితే ఒక్కోసారి ఇవి శృతి మించుతుంటుంది. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే కర్ణాటక అసెంబ్లీలో చోటుచేసుకుంది. తాజాగా కర్టాటకలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది.


గురువారం కర్ణాటక బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో.. ఎమ్మెల్యే బీకే సంగమేష్ అసెంబ్లీలోనే చొక్కా విప్పారు. చొక్కా విప్పి చేతిలో పట్టుకొని అధికార బీపేజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కారణంగా సంగమేష్‌ను సస్పెండ్ చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి బసవరాజ్ బొమ్మై తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి ఈ నెల 12 వరకు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికలతో కలిపి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై తీర్మానం కోసం అసెంబ్లీలో గురువారం చర్చించాలని నిర్ణయించుకున్నారు. దీంతో స్పీకర్ ఈ ప్రస్తావన తేగానే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే స్పీకర్ పోడియం పక్కనే ఉన్న భద్రవిరి నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీకే సంగమేష్ తన చొక్కా విప్పి ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా సభలో నినాదాలు చేశారు. దీనిపై ఆగ్రహించిన స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే ఆ ఎమ్మెల్యేను సభ నుంచి సస్పెండ్‌ చేశారు.
అయితే.. సంగమేష్ మాత్రం తన చర్యను సమర్థించుకున్నారు. సస్పెండ్‌కు గురైన తర్వాత అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన ఆయన.. తనకు న్యాయం జరగట్లేదనే ఇలా చేశానన్నారు. నాకు న్యాయం జరగకుంటే ఇంకేం చేయాలి..?గూండాయిజం వంటి చెడ్డ పనులు చేయలేదు కదా అని వ్యాఖ్యానించారు.

Also Read: Kerala Gold Scam: కేరళలో గోల్డ్‌ స్కామ్‌ ప్రకంపనలు.. కేరళ సీఎం విజయన్‌పై సంచలన ఆరోపణలు

అతడో గోల్డ్‌మెడలిస్ట్‌.. చేస్తున్నవి మాత్రం రోల్డ్‌గోల్డ్ పనులు.. నీట్‌ ఎగ్జామ్‌ రాసినవారే ఇతగాడి టార్గెట్..

Corona Cases Update: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 16,838 పాజిటివ్ కేసులు, 113 మరణాలు..