Asaduddin Owaisi: ఇది మా ఇంటి సమస్య.. వారికెందుకు.. హిజాబ్ వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు..

|

Feb 09, 2022 | 6:41 PM

కాలేజీలో హిజాబ్ వివాదం కన్నడనాట రాజకీయ వేడిని పెంచింది. ఇదే అంశంపై  AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. ఆయన  TV 9తో ప్రత్యేకంగా మాట్లాడారు. మహిళలకు హిజాబ్‌

Asaduddin Owaisi: ఇది మా ఇంటి సమస్య.. వారికెందుకు.. హిజాబ్ వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు..
Asaduddin Owaisi
Follow us on

Karnataka Hijab Row: కాలేజీలో హిజాబ్ వివాదం కన్నడనాట రాజకీయ వేడిని రాజేస్తోంది. ఇదే అంశంపై  AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. ఆయన  TV 9తో ప్రత్యేకంగా మాట్లాడారు. మహిళలకు హిజాబ్‌ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని.. ఆ హక్కు పరిరక్షణ కోసమే పోరాటం జరుగుతుందన్నారు. హిజాబ్‌ కోసం పోరాడే వాళ్లకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. దీనితో పాటు మీరు ఎవరినీ బలవంతం చేయకూడదని ముత్తుస్వామి తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. ఏం తినాలి.. ఏ బట్టలు వేసుకోవాలో వారి ఇష్ట ప్రకారం జరుగుతుందన్నారు.అదే సమయంలో సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు. కర్నాటక బీజేపీ తప్పుడు నోటిఫికేషన్‌ ఇచ్చి హిజాబ్‌ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ఇందులో కర్ణాటక ప్రభుత్వ నోటిఫికేషన్ ఆర్టికల్ 14, 15, 19, 21ని నిషేధిస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు.

సుప్రీంకోర్టు నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండి అయా (2014) కేసు గురించి ఆయన ఈ సంర్భంగా గుర్తు చేశారు.  ఇది ఇస్లాంలో ముస్లిం మహిళల మతంలో భాగమన్నారు. ముస్కాన్‌ ఖాన్‌ పోరాడిన చోట లక్ష్మి పోరాడి వుంటే నేను ఇలాగే స్పందిస్తానన్నారు.

అదే సమయంలో పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యపై ఓవైసీ మాట్లాడుతూ.. ముందుగా విదేశాల్లో ఉన్న మలాలా యూసుఫ్‌ను పాకిస్తాన్‌కు ఆహ్వానించాలని .. ఆ దిశగా పాక్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. హిజాబ్‌ మా ఇంటి సమస్య.. మేం పరిష్కరించుకుంటాం.. మా చట్టాల గురించి.. మా గురించి మాట్లాడ్డానికి పాకిస్తాన్ ఎవరు.. ? అంటూ ప్రశ్నించారు. పాకిస్తాన్‌లో షియా, బలూచి సోదరులపై తరచూ దాడులు జరుగుతున్నాయి. బాంబు దాడులు జరుగుతున్నాయన్నారు. ఇస్లాం మతానికి  నిజమైన అర్థాన్ని ఇప్పటి వరకు పాకిస్తాన్ అర్థం చేసుకోలేదని మండిపడ్డారు. కాబట్టి వారు మన భారత రాజ్యాంగం గురించి మాట్లాడకూడదన్నారు.

ఇవి కూడా చదవండి: Tukkuguda: అధికార టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి చేరిన తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్

UP Elections: ఎస్పీలో అఖిలేష్ యాదవ్ మేనమామ శివపాల్‌కు అవమానం! బీజేపీలో చేరిన పీఎస్పీ నేతలు..