Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం.. మరో బస్సును ఢీ కొట్టిన ఎలక్ట్రిక్ బస్సు.. ఐదుగురు మృతి..

| Edited By: Balaraju Goud

Jan 31, 2022 | 7:22 PM

ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ ఎలక్ట్రిక్​ బస్​ మరో బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరికొందరికి..

Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం.. మరో బస్సును ఢీ కొట్టిన ఎలక్ట్రిక్ బస్సు.. ఐదుగురు మృతి..
Kanpur Bus Accident
Follow us on

Kanpur Bus Accident: ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ ఎలక్ట్రిక్​ బస్​ మరో బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరికొందరికి గాయాలైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటన టాట్​ మిల్​ కూడలి సమీపంలో జరిగినట్లు వివరించారు. ఈ ఉదయం  కాన్పూర్‌లోని ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్నవారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కనీసం ఆరుగురు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. టాట్‌మిల్‌ క్రాస్‌రోడ్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి పలు వాహనాలను, పక్కనే ఉన్నవారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు, పలు బైక్‌లు బస్సు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత బస్సు ట్రాఫిక్ బూత్ గుండా వెళ్లి ట్రక్కును ఢీకొట్టడంతో ఆగిపోయింది. దీనిపై స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు.

బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం వెతుకుతున్నాట్లు తూర్పు కాన్పూర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా, మరికొందరికి గాయాలైయ్యాయి.ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ప్రియాంక గాంధీ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: CM KCR: పార్లమెంట్‌లో ఇలా చేద్దాం.. పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశనం..

Viral Video: చూశారుగా.. నేనేంటో.. నా బలమేంటో.. సైలెంట్‌గా చేసి చూపించింది..