కరోనా ఎఫెక్ట్: ఉద్యోగులకు షాక్‌.. భారీగా ఉద్యోగాల కోత తప్పదా..!

| Edited By:

Apr 06, 2020 | 12:35 PM

కరోనా ఎఫెక్ట్‌ ఉద్యోగులపై భారీగా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉద్యోగాల్లో భారీ కోతలు ఉంటాయని.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్‌ ఇండస్ట్రీ(సీఐఐ) తెలిపింది.

కరోనా ఎఫెక్ట్: ఉద్యోగులకు షాక్‌.. భారీగా ఉద్యోగాల కోత తప్పదా..!
Follow us on

కరోనా ఎఫెక్ట్‌ ఉద్యోగులపై భారీగా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉద్యోగాల్లో భారీ కోతలు ఉంటాయని.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్‌ ఇండస్ట్రీ(సీఐఐ) తెలిపింది. 200 మందికిపైగా సీఈవోలతో ఆ సంస్థ చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాక్‌డౌన్‌ కాలం పూర్తయ్యాక అనేక రంగాల్లో ఉద్యోగ కోతలు ఉండొచ్చని 52శాతం మంది సీఈవోలు చెప్పిన్లు సీఐఐ పేర్కొంది.

సీఐఐ చెప్పిన వివరాల ప్రకారం.. లాక్‌డౌన్ పూర్తయ్యాక 15శాతం కంటే తక్కువ ఉద్యోగ కోతలు ఉంటాయని 47శాతం మంది.. 15 నుంచి 30శాతం వరకు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని 32 శాతం మంది సీఈవోలు చెప్పారు. ఇక ఆదాయం విషయంలో 10శాతానికి పైగా క్షీణత ఉంటుందని, లాభంలో 5శాతం కన్నా ఎక్కువే క్షీణత ఉంటుందని పలు సంస్థలు వెల్లడించాయి. మరోవైపు ఆ ప్రకటతో ఉత్పాదక రంగాల్లోని ఉద్యోగులు కలవరపాటుకు గురౌతున్నారు.

Read This Story Also: ఆ నటి మాజీ భాయ్‌ప్రెండ్‌తో పూజా డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!