Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • చెన్నై నగరంలో మరికొన్ని ఆంక్షల సడలింపు. ఉ. 6.00 నుంచి రాత్రి 9.00 వరకు హోటళ్లు (పార్సిల్ సర్వీసు మాత్రమే). రాత్రి 9.00 వరకు మాత్రమే హోం డెలివరీ ఉ. 6.00 నుంచి సా. 6.00 వరకు టీ స్టాళ్లకు అనుమతి. కిరాణా షాపులు, కూరగాయల దుకాణాలు ఉ. 6 నుంచి సా. 6 వరకు. మాల్స్ మినహా మిగతా దుకాణాలు ఉ. 10 నుంచి సా. 6 వరకు. సడలింపులు జులై 6 నుంచి అమలు.
  • విశాఖ: కేజీహెచ్ సూపరెంటెండెంట్ డాక్టర్ అర్జున. క్లినకల్ ట్రయల్స్ కు కేజీహెచ్ ను ఎంపిక చేసునట్టు ఐసీఎంఆర్ నుంచి మెయిల్ వచ్చింది. క్లినికల్ ట్రయల్స్ కోసం ప్రభుత్వ అనుమతి కోరాం. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా - డీసీజీఐ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఎథిక్స్ కమిటీ విధివిధానాలు తరువాత కార్యకలాపాలు ప్రారంభిస్తాం. అన్ని క్లియరెన్స్ లు పూర్తయ్యేందుకు 3 రోజుల సమయం పట్టే అవకాశముంది. ఆ తరువాత కేజీహెచ్ లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తాం.
  • కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు.. ఐసోలేషన్ సెంటర్లుగా మారిన బ్యూటీ పార్లర్లు. నిబంధనలను తుంగలో తొక్కి కోవిడ్ రోగులకు గదులు అద్దెకు ఇస్తున్న వైనం. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు గదులు అద్దెకు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లోని colours బ్యూటీ స్టూడియోలో కరోనా పాజిటివ్ వ్యక్తులకు అశ్రయం. రోజుకు రూ.10వేల ఫీజు.. వసూలు..గుట్టు చప్పుడు కాకుండా అక్రమ దందా.
  • REC, ఫైనాన్స్ కార్పొరేషన్ ల నుంచి 12600 కోట్ల రూపాయలు అప్పు తీసుకునేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలకు గ్యారెంటీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సర్కార్. అప్పుల్లో కూరుకుపోయిన డిస్కమ్ లకు ప్రభుత్వ అనుమతితో ఊరట.
  • విజయవాడ: వైసీపీ యం.పి రఘురామకృష్ణ రాజు కామెంట్స్. అమరావతి అనేది రాష్ట్రానికి మధ్యలో ఉండటమే కాకుండా మంచి రాజధాని. ప్రభుత్వం రాజధాని వికేంద్రీకరణచేయాలని భావించడం సమంజసం కాదు. అమరావతిలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండి ప్రభుత్వం అక్కడనుండే నడుస్తున్నతరుణంలో మూడు ముక్కలు చేయడం అనేది అన్యాయం. అమరావతి అనేది ఏకైక రాజదానిగా ఉండాలి.. న్యాయమైన డిమాండ్ కోసం పోరాటం చేయడం సమంజసం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం లో అమరావతి రైతలకు ఇచ్చిన హామీలను కొనసాగించాలి. ఇది పార్టీ నిర్ణయం కాదు ప్రభుత్వం నిర్ణయం. కరోనా తరువాత వచ్చే ఆర్థిక పరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆలోచనలు మేరకు నడవాలి.

ఆ నటి మాజీ భాయ్‌ప్రెండ్‌తో పూజా డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!

వరుస విజయాలతో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో బిజీగా గడిపేస్తోన్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే లవ్‌లో పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో పూజా డేటింగ్ చేస్తున్నట్లు టాక్‌ నడిచింది.
Pooja Hegde about dating rumors, ఆ నటి మాజీ భాయ్‌ప్రెండ్‌తో పూజా డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!

వరుస విజయాలతో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో బిజీగా గడిపేస్తోన్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే లవ్‌లో పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో పూజా డేటింగ్ చేస్తున్నట్లు టాక్‌ నడిచింది. దీనికి తోడు ఈ ఇద్దరు కలిసి పలుమార్లు కెమెరాలకు కూడా చిక్కారు. దీంతో పూజా, రోహన్‌ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఈ రూమర్లపై పూజా క్లారిటీని ఇచ్చేసింది. తామిద్దరం మంచి స్నేహితులమేనని.. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో కూడా తెలీదని ఆమె అన్నారు.

కాగా బాలీవుడ్ స్టార్ నటుడు వినోద్ మోహ్రా కుమారుడైన రోహన్‌ మెహ్రా.. సైఫ్‌ అలీ ఖాన్‌ నటించిన బజార్‌ మూవీ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో రోహన్‌.. బాలీవుడ్ నటి తారా సుటారియాతో డేటింగ్‌లో ఉన్నట్లు టాక్ నడిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ ఏడాది అల వైకుంఠపురములోతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్న పూజా.. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ 20వ చిత్రం, అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్‌ మూవీల్లో నటిస్తోంది. హిందీలో సల్మాన్ ఖాన్ సరసన కబీ ఈద్ కబీ దీవాళి చిత్రంలో పూజా నటించనున్న విషయం తెలిసిందే.

Read This Story Also: ప్రియుడి మోజులో భర్త హత్య.. ‘లాక్‌డౌన్‌’లోనూ పక్కా ప్లాన్..!

Related Tags