బ్రేకింగ్: కరోనా కాలంలో ఉగ్రవేట.. ఏడుగురు హతం

| Edited By:

Apr 27, 2020 | 12:25 PM

జమ్మూకాశ్మీర్ కుల్గాం జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల ఉగ్ర కలకలం రేగింది. దీంతో.. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం ఏడుగురు ముష్కరులు హతమయ్యారు. ఈ మేరకు ఆర్మీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతానికి ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు..

బ్రేకింగ్: కరోనా కాలంలో ఉగ్రవేట.. ఏడుగురు హతం
Follow us on

జమ్మూకాశ్మీర్ కుల్గాం జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల ఉగ్ర కలకలం రేగింది. దీంతో.. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం ఏడుగురు ముష్కరులు హతమయ్యారు. ఈ మేరకు ఆర్మీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతానికి ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా తీవ్ర వాదుల కోసం గాలిస్తున్నారు. కుల్గాం జిల్లా లోయర్ ముందాలో ముష్కరులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు భారత సైన్యం, సీఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా కలిసి నిర్భంధ తనిఖీలు చేపట్టాయి. దీంతో ముందే పసిగట్టిన పోలీసులు సిబ్బందిపై కాల్పులు జరిపారు. అంతకు ముందు.. కుల్గాంలోని గుడ్డెర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ముష్కరులు హతమయ్యారు.

Read More: 

లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

అన్నీ తెలిసే వెళ్లాడు.. తనకి నేనేం సలహాలు ఇస్తాను? పవన్‌పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్