Maharashtra: మూడు దశాబ్దాలుగా రగులుతున్న దావాగ్ని.. కంప్లైంట్ చేసేందుకు ఏకంగా 31 సంవత్సరాలు పట్టింది..

|

Sep 21, 2022 | 9:56 PM

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 31 సంవత్సరాలు పట్టింది తనపై జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి. ఎనిమిది సంవత్సరాలు పాటు సొంత అన్న చేతిలోనే లైంగింకగా బలైన ఆ మహిళ ఎట్టకేలకు నోరు తెరిచింది...

Maharashtra: మూడు దశాబ్దాలుగా రగులుతున్న దావాగ్ని.. కంప్లైంట్ చేసేందుకు ఏకంగా 31 సంవత్సరాలు పట్టింది..
child harassment
Follow us on

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 31 సంవత్సరాలు పట్టింది తనపై జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి. ఎనిమిది సంవత్సరాలు పాటు సొంత అన్న చేతిలోనే లైంగింకగా బలైన ఆ మహిళ ఎట్టకేలకు నోరు తెరిచింది. అనుక్షణం జరిగిన ఘటనలు వేధిస్తుంటే.. గుండెల్లో గతం తాలూకూ జ్ఞాపకాలు సూదుల్లా పొడుస్తుంటే.. మౌనంగా భరించింది. దేనికైనా ఓ హద్దు ఉంటుంది కదా.. అలా ఆమె సహనం హద్దులు దాటిపోయింది. ఇప్పటికైనా నోరు విప్పకపోతే నిజం.. అబద్ధంగా మిగిలిపోతుందని భావించింది. దైర్యంగా ముందడుగు వేసి పోలీసులకు కంప్లైంట్ చేసింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన ఓ మహిళ తన 13 ఏట లైంగిక వేధింపులకు గురైంది. ఆమె వయసు ప్రస్తుతం 44 సంవత్సరాలు. ఆమె తన బాల్యంలో రాజ్​పేఠ్​ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండేవారు. ఆ సమయంలో ఆమెపై సొంత సోదరుడే లైంగికంగా వేధించాడు. ఎనిమిది సంవత్సరాల పాటు నీచానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పవద్దని, చెప్తే అంతు చూస్తానని బెదిరించాడు. దీంతో ఆమె భయపడిపోయింది. అయినా అన్న చేసే వికృత పనులు అధికమవుతుండటంతో భరించలేకపోయింది. తనపై జరుగుతున్న రాక్షస కాండను బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది.

అయితే.. కుటుంబం పరువు పోతోందని భావించిన తల్లిదండ్రులు ఆమె మాటలను పట్టించుకోలేదు. మరోసారి ఇలాంటి కంప్లైంట్లు చేయవద్దని బెదిరించారు. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. కాలక్రమంలో ఆమె తండ్రి మరణించాడు. తల్లి అనారోగ్యానికి గురైంది. ఈ క్రమంలో బాధితురాలు పెళ్లయి.. పిల్లలూ పుట్టారు. కానీ చిన్నతనంలో సొంత అన్న చేతిలోనే అనుభవించిన నరకాన్ని ఆమె మర్చిపోలేక కుమిలిపోయింది. ఇక భరించడం తన వల్ల కాదని, నిజం చెప్పాల్సిందేనని నిర్ణియించుకుని భర్తకు జరిగిన విషయాన్ని చెప్పింది.

ముంబయిలోని మలాడ్​లో నివాసముంటున్న సోదరుడిపై అమరావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్, నోయిడా ఠాణాలోనూ ఫిర్యాదు చేసింది. కాగా.. ఆమె ఫిర్యాదు విన్న పోలీసులు నివ్వెరపోయారు. జరిగిన ఘోరం గురించి ఎవరికీ చెప్పకుండా 31 ఏళ్లు మౌనంగా ఎలా భరించిందోనని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం