NBF: నెట్‌వర్క్‌ న్యూస్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఫెడరేషన్‌లో చేరిన టీవీ9 నెట్‌వర్క్‌.. పూర్తి వివరాలు

|

Aug 18, 2021 | 1:41 PM

NBF: భారతదేశంలోని అతిపెద్ద ప్రసార నెట్‌వర్క్‌ న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌ (NBF)లో ప్రముఖ బ్రాడ్ కాస్టర్ Tv9 నెట్‌వర్క్‌ చేరింది. టీవీ9 నెట్‌వర్క్‌కు ఎన్‌బీఎఫ్‌ స్వాగతం పలికింది.

NBF: నెట్‌వర్క్‌ న్యూస్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఫెడరేషన్‌లో చేరిన టీవీ9 నెట్‌వర్క్‌.. పూర్తి వివరాలు
Follow us on

NBF: భారతదేశంలోని అతిపెద్ద ప్రసార నెట్‌వర్క్‌ న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌ (NBF)లో ప్రముఖ బ్రాడ్ కాస్టర్ Tv9 నెట్‌వర్క్‌ చేరింది. టీవీ9 నెట్‌వర్క్‌కు ఎన్‌బీఎఫ్‌ స్వాగతం పలికింది. ప్రజాస్వామ్య నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ జాతీయ , ప్రాంతీయ న్యూస్‌ మీడియా సంస్థల నుంచి సభ్యులు కలిగిన భారతదేశంలోఅతిపెద్ద బ్రాడ్‌ కాస్ట్‌ సంస్థ ఎన్‌బీఎఫ్‌. న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఫెడరేషన్‌లో టీవీ9 నెట్‌వర్క్‌ చేరడంపై ఎన్‌బీఎఫ్‌ ప్రెసిడెంట్‌ అర్నాబ్‌ గోస్వామి ఆనందం వ్యక్తం చేశారు. టీవీ9 నెట్‌వర్క్‌ ఎన్‌బీఎఫ్‌లోకి రావడం సంతోషకరమైన విషయమన్నారు. అలాగే జాతీయ, ప్రాంతీయ మీడియా పరంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక సంస్థ ఎన్‌బీఎఫ్‌ అని చెప్పడం గర్వంగా ఉందన్నారు. మీడియా సమస్యలను పరిష్కరించే దిశగా ఎన్‌బీఎఫ్‌ అండగా ఉంటుందన్నారు.  టీవీ9 నెట్‌వర్క్‌ చేరికతో ఎన్‌బీఎఫ్‌ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

అనంతరం టీవీ9 నెట్‌వర్క్‌ సీఈవో, ఎన్‌బీఎఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బారున్‌దాస్‌ మాట్లాడుతూ.. ఎన్‌బీఎఫ్‌లో టీవీ9 నెట్‌వర్క్‌ భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మీడియా రంగంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా అడుగులు వేస్తామన్నారు.

కాగా, NBFలో ప్రస్తుతం 24 న్యూస్, సహారా, CVR ఇంగ్లీష్, CVR హెల్త్, CVR NEWS, DA న్యూస్ ప్లస్, DY365, గులిస్తాన్ న్యూస్, IBC24, IND 24, ఇండియా న్యూస్ గుజరాత్, ఇండియా న్యూస్ హర్యానా, ఇండియా న్యూస్ హిందీ, ఇండియా న్యూస్, ఇండియా న్యూస్ పంజాబీ, ఇండియా న్యూస్ రాజస్థాన్, ఇండియా న్యూస్ UP, ఖబర్ ఫాస్ట్, MHOne, NEWS9, న్యూస్ ఫస్ట్ కన్నడ, న్యూస్ లైవ్, న్యూస్ నేషన్, న్యూస్ ఎక్స్, నార్త్ ఈస్ట్ లైవ్, నార్త్ ఈస్ట్ న్యూస్, OTV, ప్రాగ్ న్యూస్, పుతియతలైమురై, రిపబ్లిక్ బంగ్లా, రిపబ్లిక్ భారత్ ఉన్నాయి.

ఇవీ కూడా చదవండి: Pre-Approved Loan: ప్రీ అప్రూవ్డ్‌ లోన్స్‌ అంటే ఏమిటి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. ఎలాంటి అర్హతలుండాలి..?

Sensex: దేశీయ స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న బుల్ రన్.. ఆల్‌టైం హైకి సెన్సెక్స్ ..

PAN Card: నిమిషాల్లోనే ఈ-పాన్‌ కార్డు పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు