
మీరు తరచూ రైళ్లలో ప్రయాణిస్తుంటారా? టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఫోన్లలో స్క్రీన్‌షాట్లు తీసి లేదా వాట్సాప్‌లో వచ్చిన పిడిఎఫ్ (PDF) ఫైళ్లను చూపిస్తూ జర్నీ చేస్తున్నారా? అయితే ఇకపై మీరు మీ అలవాటును మార్చుకోవాల్సిందే! రైల్ వన్ (Rail One) యాప్ ద్వారా బుక్ చేసుకునే రిజర్వేషన్ లేని టిక్కెట్లకు సంబంధించి భారతీయ రైల్వే కీలకమైన కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ ద్వారా ప్రయాణికులను అప్రమత్తం చేసింది. కొత్త రూల్స్ ప్రకారం.. ప్రయాణ సమయంలో యాప్‌లోని అసలైన డిజిటల్ టిక్కెట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
కొత్త నిబంధనల ప్రకారం ఏ టిక్కెట్లు చెల్లవు?
టికెట్ తనిఖీ చేసే సమయంలో చాలామంది ప్రయాణికులు నెట్‌వర్క్ సమస్యల కారణంగానో లేదా సులువుగా ఉంటుందనో టికెట్ స్క్రీన్‌షాట్లను చూపిస్తుంటారు. అయితే ఇకపై అలాంటి వాటిని రైల్వే అధికారులు అంగీకరించరు. ప్రధానంగా కింద పేర్కొన్న డిజిటల్ కాపీలను చూపిస్తే ప్రయాణికులను వితౌట్ టికెట్‌గా పరిగణిస్తారు:
* టికెట్ పిడిఎఫ్ (PDF) కాపీ
* టికెట్ తీసిన ఫొటో లేదా స్క్రీన్‌షాట్
* వాట్సాప్‌లో షేర్ చేసిన లేదా ఫార్వార్డ్ చేసిన టికెట్
* మరేదైనా మెసేజింగ్ యాప్ ద్వారా పంపిన టికెట్ కాపీ
రైల్వేల కొత్త నిబంధనలు ఏమిటి?
రైలు ప్రయాణంలో ఎలాంటి సమస్యలు లేదా జరిమానాలు పడకుండా ఉండాలంటే టికెట్ తనిఖీ సిబ్బంది (TTE) అడిగినప్పుడు ఈ క్రింది విధానాలను ఖచ్చితంగా పాటించాలి:
నిబంధనలను మార్చడానికి కారణం ఏంటి?
టిక్కెట్ల స్క్రీన్‌షాట్‌లు, వాట్సాప్ ఫార్వార్డ్‌లు, పిడిఎఫ్ కాపీల ద్వారా భారీగా మోసాలు జరుగుతున్నట్లు రైల్వే శాఖ గుర్తించింది. ఒకే టికెట్ స్క్రీన్‌షాట్‌ను, పిడిఎఫ్‌ను ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉపయోగించి రైల్వే ఆదాయానికి గండి కొడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ విధమైన మోసాలకు అడ్డుకట్ట వేయడానికి, పారదర్శకతను పెంచడానికి రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఎవరైనా ప్రయాణికుడు అసలైన యాప్ టికెట్ కాకుండా స్క్రీన్‌షాట్ లేదా ఫొటోలు చూపిస్తే, వారిని టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణించి రైల్వే చట్టాల ప్రకారం భారీ జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కాబట్టి ప్రయాణికులు రైలు ఎక్కే ముందే ఈ కొత్త నిబంధనలను గుర్తుంచుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.
व्हाट्सएप पर आया टिकट दिखाना पर्याप्त नहीं, रेलवे के नियम जानना है ज़रूरी!
RailOne App से बुक किया गया अनारक्षित टिकट केवल उसी पंजीकृत मोबाइल पर वैध माना जाता है, जिससे टिकट जारी हुआ हो। यात्रा के दौरान उक्त मोबाइल के साथ एक फोटोयुक्त पहचान पत्र रखना भी अनिवार्य है। व्हाट्सएप,… pic.twitter.com/5n45Jgdq4c
— South East Central Railway (@secrail) July 8, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..