PM Modi: వలస చట్టాలపై మోడీ సర్కార్‌ ఫోకస్‌.. సంచలనాత్మక మార్పులకు శ్రీకారం.. తాజాగా నౌకాదళంలో..

ప్రధాని నరేంద్ర మోడీ.. పేర్కొన్నట్లుగానే వలసవాద చరిత్రకు బ్రేక్‌ వేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్యం అనంతరం కూడా బ్రిటిష్‌ వలసవాద చట్టాలు మనదేశంలో కొనసాగుతున్నాయి.

PM Modi: వలస చట్టాలపై మోడీ సర్కార్‌ ఫోకస్‌.. సంచలనాత్మక మార్పులకు శ్రీకారం.. తాజాగా నౌకాదళంలో..
Pm Modi
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 30, 2022 | 8:49 PM

Indian Naval Ensign: ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి.. భారతదేశ విశిష్టతను నలుదిక్కులా వ్యాపించేలా పక్కా ప్రణాళికలతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం ఆత్మనిర్భర్‌ భారత్‌ లాంటి నినాదాలతో.. దేశాన్ని అన్ని రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగ్రామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నారు. ఇప్పటికే.. రక్షణ రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన మోడీ సర్కార్‌.. నావికాదళంలో మరో మార్పునకు సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ.. పేర్కొన్నట్లుగానే వలసవాద చరిత్రకు బ్రేక్‌ వేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్యం అనంతరం కూడా బ్రిటిష్‌ వలసవాద చట్టాలు మనదేశంలో కొనసాగుతున్నాయి. అయితే.. వీటిని రూపుమాపి.. మన రాజ్యాంగానికి అనుగుణంగా, సంస్కతి సంప్రదాయాలను ప్రతిబింభించేలా సరికొత్త నిర్ణయాలను తీసుకొని మోడీ సర్కార్‌ నూతన చరిత్రను సృష్టిస్తోంది. వలస వారసత్వాన్ని విడనాడడంపై మోదీ ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 2, 2022న కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో మొదటి స్వదేశీ విమాన వాహక నౌక INS విక్రాంత్‌ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వలసవాద చిహ్నాన్ని తొలగించి సుసంపన్నమైన భారతీయ సముద్ర వారసత్వానికి తగినట్లుగా కొత్త నౌకాదళ చిహ్నాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించనున్నారు. ప్రస్తుత నౌకాదళ చిహ్నం సెయింట్ జార్జ్ క్రాస్‌ (శిలువ ఆకారం)తో ఉంటుంది. నాలుగు ఎర్రని స్ట్రైప్స్‌తో.. ఎడమ వైపున పైన మన దేశ జెండా, స్ట్రైప్స్‌ మధ్యలో జాతీయ చిహ్నం ఉంటుంది. అయితే.. దీనిని స్వాతంత్ర్యానికి ముందు.. స్వాతంత్ర్యానికి తరువాత పలుమార్లు మార్పులు చేశారు. 1950 తర్వాత నౌకాదళ చిహ్నం మార్పు రావడం ఇది నాలుగోసారి. అంతకుముందు 2004లో మార్పు చేశారు. కొత్త నౌకాదళ చిహ్నం.. భారతీయ నౌకాదళం ఖ్యాతిని మరింత పెంచేలా రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే.. వలసవాదాన్ని రూపుమాపుతూ.. భారతదేశ ఖ్యాతికి అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు పేర్కొంటున్నారు. నౌకాదళ చిహ్నానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దీనిపై ప్రధానమంత్రి మోడీ ఇటీవల ఆగస్టు 15న జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రసంగించారు. అమృత్ మహోత్సవ్‌లో భాగంగా వలసవాద మనస్తత్వం లేని భారతదేశాన్ని నిర్మించడం గురించి పునరుధ్ఘాటించారు. వలసరాజ్యాల మార్కును తోసిపుచ్చడానికి ప్రధాని మోదీ చేసిన ప్రయత్నం ఇదే మొదటిసారి కాదు. గత ఎనిమిదేళ్లలో ఈ దిశగా అనేక చర్యలు చేపట్టారు.

● మోడీ ప్రభుత్వం 1500 కంటే ఎక్కువ పాత, వాడుకలో లేని చట్టాలను రద్దు చేసింది. ఈ చట్టాలు చాలా వరకు బ్రిటిష్ కాలం నాటివి.

ఇవి కూడా చదవండి

2022 రిపబ్లిక్ డే సందర్భంగా బీటింగ్ రిట్రీట్ వేడుక ముగింపులో ‘అబిడ్ విత్ మీ’ స్థానంలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడిన కవి ప్రదీప్ సెమినల్ పీస్ ‘ఏ మేరే వతన్ కే లోగోన్’తో భర్తీ చేశారు. అంతకుముందు 2015లో బీటింగ్ రిట్రీట్‌లో భారతీయ సంగీత వాయిద్యాలు సితార్, సంతూర్, తబలా లాంటి వాటిని చేర్చారు.

● గతంలో ఫిబ్రవరి చివరి రోజున కేంద్ర బడ్జెట్‌ను ప్రకటించేవారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించడం ప్రారంభించారు. ఆ నెల చివరి పనిదినాన్ని ఉపయోగించుకునే వలసరాజ్యాల కాలం సంప్రదాయానికి దూరంగా ఉన్నారు. బడ్జెట్ సైకిల్‌లో చిన్నగా కనిపించడం వల్ల పెద్ద ఆబ్జెక్టివ్-రిఫార్మింగ్ ఫిస్కల్ గవర్నెన్స్ ఉంది.

● రైలు బడ్జెట్‌ను 92 సంవత్సరాల పాటు విడిగా సమర్పించిన తర్వాత 2017లో యూనియన్ బడ్జెట్‌లో విలీనం చేశారు. ఇది బ్రిటిష్ కాలంనాటి పద్ధతుల నుంచి మరొక నిష్క్రమణ.

● ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ హోలోగ్రామ్ తర్వాత నేతాజీ విగ్రహంతో భర్తీ చేయవలసి ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏడాది పొడవునా వేడుకలను నిర్వహించడంతోపాటు కొత్త విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. కింగ్ జార్జ్ V విగ్రహం ఉన్న చోట ఆవిష్కరించనున్నారు. దీనిని 1968లో తొలగించారు.

● ప్రధానమంత్రి ఇటీవల కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో బిప్లోబి భారత్ గ్యాలరీని ప్రారంభించారు. ఒకప్పటి బ్రిటిష్ ఎంప్రెస్ ఆఫ్ ఇండియా పేరు పెట్టిన దానిలో స్వాతంత్ర్య పోరాటంలో విప్లవకారుల చరిత్రను ప్రదర్శించే గ్యాలరీని PM ప్రారంభించారు.

● NEP 2020లో ప్రతిబింబించినట్లుగా PM మాతృభాషలో బోధనకు ప్రాధాన్యమిస్తునే.. పలు ప్రతిపాదనలు చేశారు. ఇది ప్రధానంగా ఆంగ్ల ఆధారిత విద్యపై దృష్టి సారించడం నుంచి భాషా నైపుణ్యాలను పెంచేలా చేస్తుంది. ఇది బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న పద్దతులను రూపుమాపి.. భారతీయ చరిత్రకు సంబంధించిన సరికొత్త విషయాలను పరిచయం చేస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి