India Covid-19: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు.. నిన్న ఎన్నంటే..?

|

Oct 15, 2021 | 10:17 AM

India Corona Updates: దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో

India Covid-19: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు.. నిన్న ఎన్నంటే..?
India Corona
Follow us on

India Corona Updates: దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో ఇటీవల 20వేల దిగువన కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,862 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 379 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గగా.. మరణాల సంఖ్య పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,37,592 కి పెరిగింది. దీంతోపాటు మరణాల సంఖ్య 4,51,814 కి చేరింది. అయితే.. నిన్న కరోనా నుంచి 19,391 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,33,82,100 కి చేరిందని కేంద్రం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 2,03,678 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా దేశంలో రికవరీ రేటు భారీగా పెరిగినట్లు కేంద్రం తెలిపింది. మార్చి తర్వాత రికవరీ రేటు 98.07శాతానికి పెరగింది.

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 97,14,38,553 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న దేశవ్యాప్తంగా 30,26,483 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 11,80,148 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు 58,88,44,673 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Also Read:

RSS: దేశ విభజన ఒక విచారకరమైన చరిత్ర.. నాగ్‌పూర్‌లో ‘ఆయుధ పూజ నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్..

Spying: పాక్ మహిళతో వాట్సప్ చాటింగ్.. మిలటరీ ఉద్యోగి అరెస్ట్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..