Parliament Budget Session 2022: రేపటి నుంచే పార్లమెంట్ సమావేశాలు.. పూర్తి షెడ్యూల్ వివరాలివే..

|

Jan 30, 2022 | 10:44 PM

Parliament Budget Session 2022: మరికొన్ని గంటల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ సమావేశానికి

Parliament Budget Session 2022: రేపటి నుంచే పార్లమెంట్ సమావేశాలు.. పూర్తి షెడ్యూల్ వివరాలివే..
Follow us on

Parliament Budget Session 2022: మరికొన్ని గంటల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రెండు విడతలుగా జరుగనున్న ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. 31 జనవరి 2022 నుంచి 11 ఫిబ్రవరి 2022 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఆ తరువాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు మలివిడత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. ఫిబ్రవరి 2 నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాజ్యసభ సమావేశం కానుంది. ఫిబ్రవరి 2 బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశం లోక్ సభ సమావేశం కానుంది.

కాగా, దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలను అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఉభయ సభలకు చెందిన సభ్యులు విడివిడిగా కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. కాగా, సోమవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్ లో ఉభయసభల సభ్యులనుద్దేశించి రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ప్రసంగిస్తారు. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. అనంతరం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెడుతారు.

Also read:

Puneeth Rajkumar: తమ్ముడి చివరి సినిమాకు డబ్బింగ్ చెప్తూ కన్నీళ్లు పెట్టున్న శివన్న..

Viral Video:చట్నీతో గోల్గప్పా ఐస్‌క్రీం రోల్స్‌.. కొత్తగా ఉంది కదూ.. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి..

Black Pepper Essential Oil: బ్లాక్ పెప్పర్ ఆయిల్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి..