India Corona: గడిచిన 24 గంటల్లో దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివ్‌ కేసులు.. పెరిగిన మరణాలు

|

May 02, 2021 | 10:02 AM

India Corona: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా ఎన్ని చర్యలు చేపట్టినా..

India Corona: గడిచిన 24 గంటల్లో దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివ్‌ కేసులు.. పెరిగిన మరణాలు
India Corona
Follow us on

India Corona: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా పాజిటివ్‌ కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 4 లక్షలకుపైగా కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో దానికంటే 10 వేలు తక్కువగా నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా ఐదో రోజు మూడు వైలకుపైగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,92,603 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 3673 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,95,49,943కు చేరగా, మృతులు 2,15,454కు పెరిగారు. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,07,865 మంది కోలుకోగా, ఇప్పటి వరకు దేశంలో 1.59 కోట్ల మంది కోవిడ్‌ను జయించారు. ఇక రికవరీ రేటు 81.77 శాతం ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 33,39,644 క్రియాశీల కేసులుండగా, యాక్టివ్‌ కేసుల రేటు 17.13 శాతం ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక నిన్న 18.26 మందికి కరోనా టీకాలు వేశారు.

ఇక తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా 63,282 నమోదు కాగా, కర్ణాటకలో 40,990, కేరళలో 35,636 నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అదేవిధంగా మహారాష్ట్రలో 802, ఢిల్లీలో 412, ఉత్తరప్రదేశ్‌లో 303 మంది మృతిచెందారు. ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరో వైపు పాజిటివ్‌ కేసులు, మరణాలు సంభవిస్తు్న్నాయి. పలు రాష్ట్రాల్లో ఎక్కువగా పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇక మాస్క్‌ ధరించకుండా బయట కనిపించే వారిపై అధికారులు చర్యలు చేపడుతున్నారు అలాంటి వారిపై భారీగా జరిమానా విధిస్తున్నారు.

 

ఇవీ కూడా చదవండి

WHO Warning: భారత్‌లో ఉన్న పరిస్థితులు ఎక్కడైనా జరగవచ్చు.. ఐరోపా దేశాలను హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో

Covid-19: వాసన పరీక్షతో కరోనా గుర్తింపు.. సరికొత్త కిట్‌ను అభివృద్ధి చేసిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు.. ఎలాగంటే..!