దసరా ఉత్సవాలు: బిడ్డలను ఎత్తుకున్న ‘దుర్గమ్మ’.. మొత్తానికి ఇంటికి చేరుకుంది

| Edited By:

Oct 17, 2020 | 1:10 PM

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా మండపాలను ఏర్పాటు చేశారు.

దసరా ఉత్సవాలు: బిడ్డలను ఎత్తుకున్న దుర్గమ్మ.. మొత్తానికి ఇంటికి చేరుకుంది
Follow us on

Migrant Worker Statue: దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా మండపాలను ఏర్పాటు చేశారు. ఇక దసరా ఉత్సవాలు అద్భుతంగా జరిగే పశ్చిమ బెంగాల్‌లో కొన్ని మండపాలను వినూత్నంగా తయారుచేశారు. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్‌లో వలస కార్మికుల పరిస్థితిని, వర్కర్లు చేసిన సేవలను గుర్తిస్తూ కొన్ని మండపాలు వెలిశాయి.

అందులో భాగంగా బెహలాలోని బరిషా క్లబ్‌లో రింటు దాసు అనే ఓ ఆర్టిస్ట్‌.. తన పిల్లలతో ఉన్న ఓ వలస కార్మికురాలు విగ్రహాన్ని తయారు చేశారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. ”లాక్‌డౌన్ సమయంలో ఓ మహిళ తన నలుగురు పిల్లలను ఎలాంటి భయం లేకుండా తీసుకెళ్తుండటం చూశాను. దాన్ని చూసే ఈ విగ్రహాన్ని చేయాలన్న ఆలోచన నాకు వచ్చింది” అని అన్నారు. ఇక మరికొన్ని మండపాల్లో వలస కార్మికులు, కరోనా సమయంలో సేవ చేసిన వారిని గుర్తిస్తూ విగ్రహాలు తయారు చేశారు. ఈ విగ్రహాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారగా.. పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో చాలా మంది వలస కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారిలో కొంతమంది ఎలాగోలా తమ స్వగృహాలకు చేరుకున్నప్పటికీ, మరికొందరు మాత్రం మార్గమధ్యమంలో మరణించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అందరి చేత కంటతడి పెట్టించిన విషయం తెలిసిందే.

Read More:

‘మహా సముద్రం’లో మరో హీరోయిన్ ఎవరంటే..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కి ‘రాధేశ్యామ్’‌ టీమ్‌ బర్త్‌డే కానుక.. ఏంటో తెలుసా..!