Big Family: ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది.. రోజుకు 90 కిలోల బియ్యం

Big Family: గడిచిన సంవత్సరాలలో ఈ అసాధారణమైన కుటుంబం అంతర్జాతీయ మీడియా, డాక్యుమెంటరీ దర్శకులు, ప్రపంచవ్యాప్త పర్యాటకుల దృష్టిని ఆకర్షించింది. ఇంత పెద్ద కుటుంబం ఒకే పైకప్పు కింద కలిసి ఎలా జీవిస్తోందో కళ్లారా చూసేందుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి..

Big Family: ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది.. రోజుకు 90 కిలోల బియ్యం
Big Family

Updated on: Jun 11, 2026 | 7:52 AM

Big Family Story: ఇప్పుడు 39 మంది భార్యలు, 94 మంది పిల్లలలతో మొత్తం 200 మందిలో ఒకే కుటుంబంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకే కుటుంబంలో ఇంత మంది ఉండటం ఆశ్చర్యపోతున్నారు. భారతదేశంలో నివసిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం ఇది. మిజోరంలోని బక్తావంగ్ గ్రామానికి చెందిన జియోనా చానా ఈ మహా సామ్రాజ్యానికి అధిపతి. మిజోరంలో బహుభార్యాత్వాన్ని ఆచరించిన ఒక వ్యక్తికి ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం ఉంది. 2021లో తన 76వ ఏట కన్నుమూసిన జియోనా చానా, 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు,33 మంది మనవడు/మనవరాళ్లతో కూడిన తన భారీ కుటుంబానికి పెద్దగా వ్యవహరించారు. ఆ భారీ కుటుంబం’న్యూ జనరేషన్ హౌస్’ అని పిలిచే 100 గదులున్న నాలుగు అంతస్తుల ఇంట్లో కలిసి నివసిస్తోంది.

గడిచిన సంవత్సరాలలో ఈ అసాధారణమైన కుటుంబం అంతర్జాతీయ మీడియా, డాక్యుమెంటరీ దర్శకులు, ప్రపంచవ్యాప్త పర్యాటకుల దృష్టిని ఆకర్షించింది. ఇంత పెద్ద కుటుంబం ఒకే పైకప్పు కింద కలిసి ఎలా జీవిస్తోందో కళ్లారా చూసేందుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ‘బక్తాంగ్’ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ఈ కుటుంబం కథ ప్రముఖ ‘రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ (Ripley’s Believe It or Not) లో కూడా ప్రచురితమైంది.

ఇది కూడా చదవండి: Gold Price: ఇలాంటి మంచి రోజులు వస్తాయని మీరెప్పుడైనా ఊహించారా? భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!

ఇంట్లో పనుల బాధ్యతలు:

ఇంత పెద్ద కుటుంబాన్ని నిర్వహించడం అంత తేలికైన పని కాదు. ప్రతిరోజూ పెద్ద మొత్తంలో ఆహారం తయారు చేస్తారు. ఇంటి పనులు కుటుంబ సభ్యుల మధ్య విభజించడంతో ఎవరి పనులు వారు చేసేస్తుంటారు. కొందరు వంటలో సహాయం చేస్తే, మరికొందరు వ్యవసాయం, శుభ్రపరచడం, నిర్వహణ, ఇతర బాధ్యతలను చూసుకుంటారు.

ప్రతి రోజు ఎన్ని కిలోల బియ్యం అవసరం?

కేవలం వంటగదిని చూస్తేనే సందర్శకులు ఆశ్చర్యపోతారు. ఆ కుటుంబం ప్రతిరోజూ 45-90 కిలోల బియ్యంతో పాటు, సుమారు 40 కిలోల బంగాళాదుంపలు, 25 కిలోల కూరగాయలు, 20 కిలోల పప్పుధాన్యాలు వండుతారని నివేదికలు సూచిస్తున్నాయి. ఇక మాంసాహార వంటకాల విషయానికొస్తే.. 30-35 కోళ్లు అవసరం కావచ్చు.

కట్టెల పొయ్యిపైనే వంట:

ఇక భారీ కట్టెల పొయ్యిలపై ఉంచిన పెద్ద పెద్ద పాత్రలు, అల్యూమినియం పాత్రలతో కూడిన ఒక పెద్ద సామూహిక వంటగదిలో వంట జరుగుతుంది. భార్యలు షిఫ్టుల వారీగా భోజనం తయారు చేస్తుండగా, కూతుళ్లు, కోడళ్లు ఇంటి రోజువారీ పనులను చూసుకోవడంలో సహాయపడతారని సమాచారం.

ఇది కూడా చదవండి: MG Motors: దేశంలో అత్యంత చౌకైన ఈవీ కారుపై రూ.80 వేలు తగ్గింపు.. సింగిల్‌ ఛార్జ్‌తో 230 కి.మీ రేంజ్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us