Haridwar Kumbh Mela 2021: కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. మకరసంక్రాంతి రోజు నుంచి కుంభమేళా ప్రారంభం..

|

Jan 05, 2021 | 5:58 PM

ఓవైపు ఏడాది గడిచినా ఇంకా అదుపులోకి రాని కరోనా వైరస్.. మరోవైపు తాజాగా విజృంభిస్తున్న బర్ద్ ఫ్లూ .. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన కుంభమేళా

Haridwar Kumbh Mela 2021: కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. మకరసంక్రాంతి రోజు నుంచి కుంభమేళా ప్రారంభం..
Follow us on

Haridwar Kumbh Mela 2021: ఓవైపు ఏడాది గడిచినా ఇంకా అదుపులోకి రాని కరోనా వైరస్.. మరోవైపు తాజాగా విజృంభిస్తున్న బర్ద్ ఫ్లూ .. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన కుంభమేళా 2021 జనవరి 14న మకర సంక్రాంతి రోజున ప్రారంభం కానుంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళా గంగా నది ఒడ్డునున్న హరిద్వార్ తో పాటు అలహాబాద్, ఉజ్జయిని, నాసిక్‌లో నిర్వహించడానికి అక్కడ ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. భక్తులు గంగా నదిలో స్నానమాచరించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కుంభమేళా సందర్భంగా లక్షలాది మంది భక్తులు గంగానదిలో పవిత్ర స్నానాన్ని చేస్తారు. ఇలా స్నానమాచరించడం వల్ల పాపం నశిస్తుందని.. మోక్షం లభిస్తుందని… వ్యాధులు నివారింపబడతాయని.. భక్తుల విశ్వాసం.

12 ఏళ్లకోసారి వచ్చే ఈ కుంభమేళా ఈనెల 14 న ప్రారంభమై.. ఏప్రిల్ 27 చైత్ర పూర్ణిమరోజున ముగుస్తుంది. ఈ కుంభంలో ప్రధానంగా 4 షాహిస్నాన్ ఘాట్‌లు, 6 ప్రధాన స్నాన్ ఘాట్‌లుంటాయి. ఈ కుంభమేళాలో భక్తులు పవిత్రమైన నదీ స్నానాలను చేస్తారు. ముఖ్యమైన పర్వదినాల్లో ఈ స్నానాలను ఆచరించడం హిందూ సంప్రదాయంలో గొప్ప విశేషంగా భావిస్తారు. అంతేకాదు ఈ కుంభమేళాలో గంగానది స్నానమాచరించడానికి మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పూర్ణిమ, మహా శివరాత్రి , సోమవతి అమవాస్య, బైసాకి, శ్రీరామ నవమి, చైత్ర పూర్ణిమ వంటి ప్రత్యేక రోజుల్లో భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారు.

Also Read:

మొదటి సినిమా విడుదల కాకుండానే మంచి ఆఫర్స్ అందుకుంటున్న కృతి లక్కీ ఛామ్

గులకరాళ్ళతో అద్భుత కోట.. ఓ పోస్ట్ మాన్ క్రియేటివిటీకి అందరూ ఫిదా..!