GST Rate Hike: రానున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కనిష్ఠంగా(Lower Slab) ఉన్న 5 శాతం స్లాబ్ రేటును 8 శాతానికి పెంచనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రిపోర్టు కౌన్సిల్ ముందుకు నెలాఖరు నాటికి రానున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనున్నట్లు తెలుస్తోంది. నిత్యావసరాలను టాక్స్ పరిధి(Tax Limit) నుంచి తప్పించటం లేదా కనిష్ఠ శ్లాబ్ కింద పన్ను విధిస్తారు. అలాగే లగ్జరీ వస్తువులు, సేవలను గరిష్ఠ శ్లాబ్ రేటు కింద(28%) పన్ను విధిస్తారు.
ప్రస్తుతం 5 శాతంగా ఉన్న స్లాబ్ ను 8 శాతానికి పెంచటం ద్వారా ప్రభుత్వానికి అధనంగా ఏడాదికి రూ. 1.50 లక్షల కోట్ల ఆధాయం రానుంది. జీఎస్టీలో ప్రతి ఒక్కశాతం టాక్స్ రేటును పెంచటం వల్ల రూ. 50 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుంది. ప్రస్తుతం ఉన్న రేట్లను 8%, 18%, 28%గా మార్చాలని కొంత మంది మంత్రులు ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదవ వల్ల ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీ స్లాబ్ 18 శాతానికి పెరగనుంది. అంటే 6 శాతం పెరుగుదల. దీనికి తోడు మంత్రులు ప్రస్తుతం టాక్సు పరిధి నుంచి ఉపసమనం కల్పించిన వాటిని సైతం వివిధ టాక్స్ స్లాబ్ ల పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ప్రస్తుతం ప్యాకింగ్ చేయని, బ్రాండింగ్ చేయని, డెయిరీ ఉత్పుత్తులు జీఎస్టీ పరిధిలో లేవు.. జీఎస్టీలో వచ్చిన రెవెన్యూ షాటేజ్ ను కవర్ చేయటానికి ఈ ప్రతిపాదనలు తెచ్చినట్లు తెలుస్తోంది.
జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం ప్రస్తుతం పరిహారం కింద చెల్లిస్తోంది. ఈ ప్రక్రియకు జూన్‌తో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ఇకపై నిధుల కోసం కేంద్రంపై ఆధారపడకుండా.. స్వయంసమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతనే ఈ మార్పులను ప్రతిపాదించినట్లు సమాచారం. ఆదాయ తటస్థ రేటు తగ్గింది. రాష్ట్రాలు సుమారు ₹ 1 లక్ష కోట్ల లోటును చూపిస్తున్నందున.. GST ఆదాయాన్ని తటస్థంగా మార్చడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఏకైక మార్గం పన్ను స్లాబ్‌ను హేతుబద్ధీకరించడం, ఎగవేతలను అరికట్టడంమే మార్గాలు. గడచిన అనేక సంవత్సరాలుగా GST కౌన్సిల్ తరచుగా పరిశ్రమల డిమాండ్లకు అనుగుణంగా పన్ను రేట్లను తగ్గించింది. ఉదాహరణకు.. అత్యధికంగా 28% పన్ను పరిధిలోకి వచ్చే వస్తువుల సంఖ్యను 228 నుంచి 35 కంటే తక్కువకు తగ్గించింది.
ఇదీ చదవండి..
Indian Railway: రైల్వే ప్రయాణికులకు గమనిక.. టికెట్‌పై ఉండే ఈ 5 అంకెల సంఖ్యని గమనించారా..!