జెండా లేని జెన్‌జీ.. యువత వెనకే పార్టీలు..! లీకుతో మొదలైంది, మేకై దిగుతోందా?

దేశ రాజకీయాల్లో జెన్‌జీ ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందా? పరీక్షల నిర్వహణ, పేపర్ లీకులు, రిజర్వేషన్లు, ప్రభుత్వ విధానాలపై యువత రోడ్డెక్కుతున్న తీరు కొత్త రాజకీయ మార్పులకు సంకేతమా? ఇప్పటివరకు సంప్రదాయ పార్టీలకు యువత ఓటు బ్యాంకుగా మాత్రమే కనిపించగా.. ఇప్పుడు అదే యువత రాజకీయ పార్టీల అజెండాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంటోందా? సోషల్ మీడియా నుంచి యూనివర్సిటీ క్యాంపస్‌ల వరకు జెన్‌జీ చురుకుదనం పెరుగుతున్న నేపథ్యంలో.. రాబోయే ఎన్నికల్లో యువ ఓటర్లు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? జెన్‌జీ నిజంగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందా అనే చర్చ ఆసక్తికరంగా మారింది.

జెండా లేని జెన్‌జీ.. యువత వెనకే పార్టీలు..! లీకుతో మొదలైంది, మేకై దిగుతోందా?
Gen Z Politics In India

Updated on: Aug 11, 2026 | 9:40 PM

రిసెంట్‌ డేస్‌లో ఒకటి గమనించారా? తొంభై ఏళ్ల కిందట శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం.. సమాజంలో కుళ్లును కడిగెయ్యాలని చెప్పే పవర్‌ఫుల్ బుక్.. ఆన్‌లైన్‌లో ఇప్పుడు అమాంతం 40 శాతం సేల్స్ పెరిగాయి. బాగా కనెక్టయిన కుర్రకారు వేలంవెర్రిగా కొనేస్తున్నారు. షెర్లాక్ హోమ్స్ ఫిక్షనరీ కంటెంటున్న నావెల్స్‌తో టైమ్‌పాస్ చేసే యువజనం.. మహాప్రస్థానం చదవడానికి అలవాటుపడ్డారంటే సమ్‌థింగ్‌ ఫిష్షింగ్ కదా? ఆకలిరాజ్యాల్ని, పోరాటతత్వాల్ని చక్కగా ఆవిష్కరించి, రక్తాన్ని ఉడుకెత్తించే రచనల్ని ఆస్వాదిస్తున్న యూత్‌.. తమ ఆలోచనల్ని ఎటువైపు మౌల్డ్ చేస్తున్నట్టు? దేశం ఎటుపోతోందన్న కసితో, కాన్షియస్‌తో రోడ్డెక్కి చేస్తున్న ఈ రచ్చల సారాంశం ఏంటన్నట్టు? కాక్రోచ్‌లుగా మేకోవర్ ఔతూ, పదండి ముందుకు, పదండి తోసుకు.. పోదాంపోదాం పాలిటిక్స్‌లోకి అంటోందా? తాజా రాజకీయాల్లో జెన్‌జీ ఫ్యాక్టర్ ఎంత మాత్రం? గేరు మార్చిన కుర్రకారు ఆవేశంతో ఊగిపోతోంది. ఉడుకురక్తం రంగు మార్చుకుంటోంది. ఏదో కొత్తగా ఆలోచిస్తోంది. ఒక ఛేంజ్ కావాల్సిందే అంటున్నట్టుంది వీళ్ల దూకుడు చూస్తుంటే. నిన్నటిదాకా ల్యాప్‌టాపుల్లో తలలు దూర్చి, మరో లోకమే లేదన్నట్టు బిందాస్‌గా కనిపించిన యంగిస్థాన్ ఇప్పుడు దేశాన్ని కొత్తగా నిర్మిద్దాం రండి అని పిలుపునిస్తోంది. దశాబ్దాలుగా ఏలుతున్న మెగామెగా సైజున్న పార్టీల్నీ, ప్రభుత్వాల్నే దారికి తెచ్చుకుంటామని శపథం చేస్తున్నట్టుంది జెన్‌జీ చప్పుళ్లు వింటుంటే. నిజంగానే...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి