భారతదేశం నుండి ఏం నేర్చుకోవాలి అనే పుస్తకాన్ని భారతదేశంలో జర్మన్ రాయబారిగా ఉన్న దౌత్యవేత్త వాల్టర్ జె లిండ్నర్ రాశాడు. గ్లోబల్‌గా భారత్ పోషిస్తున్న పాత్ర గూర్చి ఆయన పుస్తకంలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా పోరాడాలన్నా, లేదా మెగా నగరాలను నడిపించాలన్నా, లేదా నీటి సంక్షోభానికి పరిష్కారం కనుగొనాలన్నా భారతదేశంలో పరిష్కారాన్ని కనుగొంటేనే ఎక్కడైనా చేయగలవు. భారతదేశం ఆధ్యాత్మికత, చరిత్ర, సంస్కృతి, మతాలు, సంగీతం-ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్ర వేసాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభాను భారత్ కలిగి ఉంది.
ప్రపంచంలోని గత రెండు-మూడేళ్ల రాజకీయ గందరగోళం, యుద్ధాలుమ జరుగుతుంటే భారత్ దేశం మాత్రం ప్రశాంతంగా ఉంది. విదేశాంగ విధానంలో భారత్ పెద్దగా ఏమీ చేయకుండానే చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారతదేశం నాన్-బ్లాక్ కంట్రీగా, నాన్ మిలిటరీ బ్లాక్ కంట్రీగా మిగిలిపోయింది. గాంధీ కాలం నుండి ఇందిరా గాంధీ, నరేంద్ర మోడీల కాలం వరకు ఇది బాగా పని చేసింది. పాశ్చాత్య దేశాలు భారతదేశాన్ని తిరిగి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 40-45 సంవత్సరాల క్రితం నేను మొదటిసారి ఇండియాకు వచ్చినప్పుడు చిన్నగా ఉంది. 50 ఏళ్లలో ప్రపంచం మారిపోయింది, భారతదేశం కూడా మారిపోయింది. అప్పటికి ఇప్పటికి భారత్‌లో చాలా విప్లవనాత్మకమైన మార్పు వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇది ఇలా ఉంటే ప్రధాని మోదీ కువైట్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కువైట్‌లో భారతీయులను చూడటం చాలా హ్యాపీగా ఉందని మోదీ అన్నారు. కువైట్‌ను చూస్తూ ఉంటే తనకు ఇదో మినీ ఇండియాలా అనిపిస్తుందన్నారు. కువైట్‌లో నిర్వహించిన హలా మోదీ కార్యక్రమాంలో ఆయన మాట్లాడారు. మీకు ఇండియా నుంచి ఇక్కడి రావడానికి 4 గంటల టైమ్ పడితే.. నాకు ఇక్కడికి రావడానికి 4 దశాబ్దాల టైమ్ పట్టిందని పేర్కొన్నారు. కువైట్‌కు భారతీయతను మనమే పరిచయం చేశామన్నారు. ప్రతి సంవత్సరం వందలాది మంది భారతీయులు కువైట్‌కు వస్తున్నారన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి