Covid 19 Patients: కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మరో ముప్పు.. తిరగబెడుతున్న చర్మ వ్యాధులు.!

|

Jun 08, 2021 | 8:17 AM

కరోనా మహమ్మారి సోకితే శరీరం బలహీనమవుతుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంతో.. పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కోవిడ్...

Covid 19 Patients: కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మరో ముప్పు.. తిరగబెడుతున్న చర్మ వ్యాధులు.!
Covid Skin
Follow us on

కరోనా మహమ్మారి సోకితే శరీరం బలహీనమవుతుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంతో.. పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో చర్మ సంబంధిత రుగ్మతులు ఉత్పన్నమవుతున్నట్లు ఢిల్లీ వైద్యులు తెలిపారు. గతంలో వారికి స్కిన్ డిసీజ్‌లు ఉంటే.. కోవిడ్ కారణంగా అవి మళ్లీ తిరగబడుతున్నాయని ఢిల్లీ, ముంబైకి చెందిన చర్మ వైద్యులు డి.ఎం.మహాజన్, సోనాలీ కోహ్లీ, నిధి రోహాత్గీ పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా నుంచి కోలుకుంటున్న రోగుల్లో హెర్ప్స్ అనే చర్మ వ్యాధిని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉంటే మహిళల్లో జుట్టు అధికంగా రాలడం వంటి సమస్య కనిపిస్తోందని.. గోళ్ల వ్యాధులు తలెత్తుతున్నాయని అన్నారు. అలాగే పెదవిపై దురదతో కూడిన మంట, చర్మంపై బొబ్బలు, ఎర్రని దద్దుర్లు, నుదుటిపై నల్లని మచ్చలు వంటి లక్షణాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత చాలామంది చర్మ సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారని.. వాటిని మ్యుకోర్‌మైకోసిస్‌(బ్లాక్ ఫంగస్)గా భావిస్తున్నారని డాక్టర్లు అన్నారు. ఈ రెండూ వేర్వేరు అని, వీటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు.

Also Read:

ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..

టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?