Fake Car Insurance: వేగంగా విస్తరిస్తోన్న వాహనాల ఫేక్‌ ఇన్సూరెన్స్‌ దందా.. నకిలీ సంస్థలను ఇలా గుర్తించండి…

|

Feb 06, 2021 | 11:57 PM

Fake Car Insurance Is Growing: రాజు అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఓ బడా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గతకొన్ని రోజుల క్రితం ఓ కారును కొనుగోలు చేశాడు. ఆఫీసులో బిజీగా ఉండడంతో ఆన్‌లైన్‌లో ఏదో కంపెనీ ద్వారా.

Fake Car Insurance: వేగంగా విస్తరిస్తోన్న వాహనాల ఫేక్‌ ఇన్సూరెన్స్‌ దందా.. నకిలీ సంస్థలను ఇలా గుర్తించండి...
Follow us on

Fake Car Insurance Is Growing: రాజు అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఓ బడా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గతకొన్ని రోజుల క్రితం ఓ కారును కొనుగోలు చేశాడు. ఆఫీసులో బిజీగా ఉండడంతో ఆన్‌లైన్‌లో ఏదో కంపెనీ ద్వారా కారు ఇన్సూరెన్స్‌ తీసుకున్నాడు. కొన్ని రోజుల వరకు అంతా బాగానే నడించింది. అయితే ఒకరోజు అనుకోకుండా రాజు కారు ప్రమాదానానికి గురైంది. కారుకు జరిగిన డ్యామేజ్‌ను రిపేర్‌ చేసుకునే క్రమంలో ఇన్సూరెన్స్‌ను క్లైమ్‌ చేసుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు కానీ రాజుకు తెలియలేదు అతని కారుకు ఇన్సూరెన్స్‌ చేసింది ఓ నకిలీ సంస్థ అని. ఇది ఒక్క రాజుకు మాత్రమే ఎదురైన సమస్య కాదు. చాలా మంది ఈ నకిలీ ఇన్సూరెన్స్‌ల బారిన పడ్డారు.
ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డిఎఐ) కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సమాచేరం మేరకు గత మూడేళ్లలో ఇలాంటి మూడు ఫేక్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు బయటపడ్డాయి. ఈ మూడు ఫేక్‌ కంపెనీల ద్వారా సుమారు రెండు వేలకుపైగా వాహనాలకు నకిలీ బీమా జరిగినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ బీమా సంస్థలు సాధారణంగా మార్కెట్లో ఉండే ధరల కంటే తక్కువ ప్రీమియానికే బీమా చేస్తామని ప్రచారం చేస్తారు.. దీంతో వినియోగదారులు ఇలాంటి ఫేక్‌ కంపెనీలకు ఆకర్షితులవుతున్నారు. అంతేకాకుండా కేవలం కొన్ని గంటల్లోనే ఈ నకిలీ ఇన్సూరెన్స్‌లు ఇస్తున్నారు. మూడేళ్లలో ఈ నకిలీ ఇన్సూరెన్స్‌లు విలువ రూ. వందల కోట్లలో ఉండడం గమనార్హం.

హైదరాబాద్‌లో బయటపడ్డ ఫేక్‌ దందా..

ఇక ఈ ఏడాది మొదట్లో హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా నకిలీ ఇన్సూరెన్స్‌లను ఇస్తోన్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి వెయ్యికిపైగా నకిలీ ఇన్సూరెన్స్‌ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. పొల్యుషన్‌ వెహికల్స్‌ దగ్గరికి వచ్చే వారికి మాయమాటలు చెప్పి నకిలీ ఇన్సూరెన్సులు చేశారు. అత్యవసరంగా పాలసీలు అవసరమైన వారికి ఫేక్‌ ఇన్సూరెన్స్‌లు ఇస్తున్నారు. ప్రముఖ ఇన్సూరెన్స్‌ కంపెనీల పేర్ల మీదే ఈ నకిలీగాళ్లు ఇన్సూరెన్స్‌లు అందిస్తూ పోలీసులుకు అడ్డంగా దొరికారు.

మీరు ఇన్సూరెన్స్‌ చేసుకున్న కంపెనీ రియలా.. నకిలీదా ఇలా తెలుసుకోండి..

మీ వాహనాన్ని చేయించిన ఇన్సూరెన్స్‌ పాలసీ నిజమైందా లేదా నకిలీదా తెలుసుకోవడానికి ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డీఏఐ) కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందుకోసం www. Policyholder.gov.in అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. మీరు ఇన్సూరెన్స్‌ చేసుకున్న కంపెనీ నిజమైందో లేదో ఈ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ సదరు ఇన్సూరెన్స్‌ కంపెనీ వివరాలు ఈ వెబ్‌సైట్‌లో లేకపోతే అది ఫేక్‌ అని గుర్తించాలి. ప్రతి భీమా సంస్థకు ఐఆర్‌డిఎఐ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యుఐడి) ఇస్తుంది. ఇది మీ బీమా పాలసీలో కూడా ఉంటుంది. మీ పాలసీకి యుఐడి లేకపోతే, అది నకిలీదని అర్థం. ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఫేక్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు ఇస్తే వెంటనే.. ఐఆర్‌డీఏఐకి ఫిర్యాదుల చేయాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

Also Read: Madhya Pradesh : నలుగురు మహిళలకు ఐదేళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు.. కారణం ఇదే..