Telugu News India News Eklavya Model Residential Schools Recruitment 2023 Notification Released for 38,000 Teaching and Non Teaching Posts
EMRS Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో 38,000 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మొత్తం ఖాళీల వివరాలివే
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో.. డైరెక్టు ప్రాతిపదికన 38 వేలకు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు కేంద్ర విద్యాశాఖ సోమవారం (జూన్ 5) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో.. డైరెక్టు ప్రాతిపదికన 38 వేలకు పైగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు కేంద్ర విద్యాశాఖ సోమవారం (జూన్ 5) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్ విదానంలో దరఖాస్తు స్వీకరిస్తారు. పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీతోపాటు బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లిష్/హిందీ/ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి.30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 18,000ల నుంచి రూ.2,09,200 వరకు జీతంగా చెల్లిస్తారు. నియామక విధానం, ముఖ్యమైన తేదీల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.