Elections: నేడు ఎలక్షన్ కమిషన్ కీలక భేటీ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం

|

Feb 24, 2021 | 8:31 AM

Election Commission of India: కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోనుంది. పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ ఎన్నికలకు సంబంధించి..

Elections: నేడు ఎలక్షన్ కమిషన్ కీలక భేటీ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం
Follow us on

Election Commission of India: కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోనుంది. పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మరి కాసేపట్లో భేటీ కానుంది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్ సునీల్ అరోరా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బలగాల మోహరింపు, ఏర్పాట్లపై చర్చించనున్నారు. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో బెంగాల్‌లో ఏడు నుంచి ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల నిర్వహణపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

నాలుగు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళతో పాటు ఈ కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో సైతం ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉంటే.. రేపు బెంగాల్‌లో డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ సుదీప్ జైన్ కూడా పర్యటించనున్నారు. బెంగాల్‌లో నిరంతరం తలెత్తుతున్న శాంతిభద్రతల పరిస్థితులపై ఆయన అధికారులతో చర్చించనున్నారు.

 

Also Read: