Earthquake: మేఘాలయలో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు..

|

Mar 29, 2021 | 10:23 PM

Earthquake Hits Shillong: ఉత్తర భారతదేశంలో ఇటీవల కాలంలో తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మేఘాలాయ

Earthquake: మేఘాలయలో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు..
Earthquake
Follow us on

Earthquake Hits Shillong: ఉత్తర భారతదేశంలో ఇటీవల కాలంలో తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మేఘాలాయ రాజధాని షిల్లాంగ్‌లో సోమవారం భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 3.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. సాయంత్రం 6 గంటల 52 నిమిషాల సమయంలో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో షిల్లాంగ్ వాసులు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

షిల్లాంగ్‌ ప్రాంతానికి ఆగ్నేయం దిశలో రెండు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూకంపం లోతు 10 కి.మీ మేర ఉందని పేర్కొంది. అయితే ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని మేఘాలయ అధికారులు తెలిపారు.

ఇటీవల కాలంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తోపాటు, బీహార్, యూపీ, హర్యానా తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఉత్తర భారతదేశంలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయని.. కానీ తీవ్రత కొంతమేరనే ఉంటుందంటూ అధికారులు పేర్కొంటున్నారు.

Also Read:

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. మరో 8 మంది పరిస్థితి విషమం..

వాహనదారులకు కేంద్రం శుభవార్త.. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ గడువు పెంపు