ఓ కారు.. అందులో ఓ వ్యక్తి దర్జాగా వస్తున్నాడు.. మనకు తిరుగులేదేలే అంటూ రయ్యిరయ్యిన దూసుకువస్తున్నాడు.. సరిగ్గా అప్పుడే దిమ్మతిరిగే ట్విస్ట్ తెరపైకి వచ్చింది.. పోలీసులు అంతా ఆ కారును చుట్టుముట్టారు.. అప్పటికే సమచారం అందింది. పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు.. చివరకు కారులో అణువణువు తనిఖీ చేశారు.. అప్పుడే అసలు గుట్టు బయటపడింది.. అందులో ఎన్నో అరలు బయటపడ్డాయి.. వాటిని చూసి ఖాకీలే స్టన్ అయ్యారు.. దానిలో కోట్ల విలువైన హెరాయిన్ బయటపడింది.. ఈ షాకింగ్ ఘటన అస్సాంలో జరిగింది.. నాగావ్‌లో రూ. 3.5 కోట్ల విలువైన 532 గ్రాముల హెరాయిన్‌ను అస్సాం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అస్సాం రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై తమ అణిచివేత కొనసాగిస్తూ ఒక వ్యక్తిని అరెస్టు చేసి.. కోట్లాది రూపాయల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా.. ఈ ఆపరేషన్ నిర్వహించారు.. వాహనాన్ని అడ్డగించిన తర్వాత కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఆపరేషన్‌ను నాగావ్ పోలీసులు పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు.. వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన సమయంలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కారులోని రహస్య గదుల్లో దాచిన హెరాయిన్‌ను కనుగొన్నారు. వీధి విలువ రూ. 3.5 కోట్లు ఉంటుంది.. ఈ డ్రగ్స్‌ను వాహనంలో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి జాగ్రత్తగా దాచి ఉంచారు.. అయితే పోలీసుల అప్రమత్తతతోనే ఈ ఆపరేషన్ విజయవంతం అయిందని అధికారులు తెలిపారు.
Based on input from an apprehended individual, @nagaonpolice intercepted a vehicle and recovered 532.46 grams of heroin upon thorough search.
The seized drugs is worth ₹3.5cr and was hidden in secret chambers of the vehicle.
Good job @assampolice #AssamAgainstDrugs pic.twitter.com/SZ8ewG0WKh
— Himanta Biswa Sarma (@himantabiswa) December 27, 2024
డ్రగ్స్ అణచివేతలో పోలీసుల కృషిని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రశంసించారు. పోలీసులు అప్రమత్తతోనే ఇది సాధ్యమైందంటూ వారిని అభినందిస్తూ ట్వీట్ చేశారు..
కాగా.. డ్రగ్స్ ట్రాఫికింగ్ ఆపరేషన్‌లో ఉన్న విస్తృత నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు పోలీసులు ఇప్పటికే తదుపరి దర్యాప్తును ప్రారంభించారు. హెరాయిన్ మూలాలను గుర్తించడానికి అరెస్టయిన వ్యక్తిని విచారిస్తున్నారు.
అంతకుముందు కరీమ్‌గంజ్ జిల్లాలో ఇదే విధమైన ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఘటనలో పోలీసులు డ్రగ్ పెడ్లర్‌ను అరెస్టు చేసి.. రూ. 45 కోట్ల విలువైన 1.5 లక్షల YABA టాబ్లెట్‌లను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..