Black Fungus: వ్యక్తి మెదడులో క్రికెట్‌ బంతి సైజులో బ్లాక్‌ ఫంగస్‌ తొలగింపు.. మూడు గంటల పాటు వైద్యుల ఆపరేషన్‌

|

Jun 13, 2021 | 1:15 PM

Black Fungus: వ్యక్తి మెదడులో క్రికెట్‌ బంతి సైజులో బ్లాక్‌ ఫంగస్‌ను వెలికి తీశారు వైద్యులు. 60 ఏళ్ల పేషెంట్‌కు మూడు గంటల పాటు సర్జరీ నిర్వహించిన పాట్నాలోని ఇందిరాగాంధీ..

Black Fungus: వ్యక్తి మెదడులో క్రికెట్‌ బంతి సైజులో బ్లాక్‌ ఫంగస్‌ తొలగింపు.. మూడు గంటల పాటు వైద్యుల ఆపరేషన్‌
Follow us on

Black Fungus: వ్యక్తి మెదడులో క్రికెట్‌ బంతి సైజులో బ్లాక్‌ ఫంగస్‌ను వెలికి తీశారు వైద్యులు. 60 ఏళ్ల పేషెంట్‌కు మూడు గంటల పాటు సర్జరీ నిర్వహించిన పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (IGIMS) వైద్యులు విజయవంతంగా తొలగించారు. అనిల్‌ కుమార్‌ అనే పేషెంట్‌ ఈ మధ్య కరోనా నుంచి కోలుకున్నాడు. అయితే తరచూ మైకంగా ఉండ‌టం, స్పృహ కోల్పోయినట్లు ఉండటం జరుగుతుండేది. దీంతో అత‌న్ని ఐజీఐఎంఎస్‌కు తరలించారు. అక్కడ పరిక్షలు జరిపిన వైద్యులు.. అతనికి బ్లాక్ ఫంగస్‌ సోకినట్లు గుర్తించారు. దీంతో వైద్యులు అతనికి సర్జరీ నిర్వహించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మనీష్‌ మండల్‌ మాట్లాడుతూ.. ఫంగ‌స్ అత‌ని ముక్కు ద్వారా మెద‌డులోకి చేరింద‌ని, అత‌ని కళ్లలోకి మాత్రం వెళ్లలేదని అన్నారు. నిజానికి ఇలాంటి కేసుల్లో చాలా వ‌ర‌కూ పేషెంట్ క‌ళ్లు తొల‌గించాల్సి వ‌స్తుంది. బీహార్‌లో ఇప్పటి వరకు 500కుపైగా బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోద‌య్యాయి. అయితే మే 22న బీహార్‌ ప్రభుత్వం 1897లోని సెక్షన్‌ 2 ప్రకారం.. బ్లాక్‌ ఫంగస్‌ను అంటు వ్యాధిగా ప్రకటించింది.

ఇవీ కూడా చదవండి

Coronavirus : మరోసారి కనిష్ఠ స్థాయిలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు, కాని.. భయపెడుతోన్న మరణాలు

Mumbai Lady Cop: 50 మంది నిరుపేద చిన్నారులను దత్తత తీసుకుని చదివిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్