Toolkit case: టూల్​కిట్​ కేసులో దిశ రవికి బెయిల్.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

|

Feb 23, 2021 | 4:38 PM

రైతుల ఆందోళనలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన టూల్​కిట్​ వ్యవహారంలో అరెస్టయిన దిశ రవికి బెయిల్ లభించింది.

Toolkit case: టూల్​కిట్​ కేసులో దిశ రవికి బెయిల్.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
Follow us on

Disha Ravi bail: రైతుల ఆందోళనలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన టూల్​కిట్​ వ్యవహారంలో అరెస్టయిన దిశ రవికి బెయిల్ లభించింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు రూ.లక్ష పూచీకత్తుతో ఆమెకు బెయిల్ ఇచ్చింది. కాగా.. దిశను వివిధ కోణాల్లో విచారించారు పోలీసులు. సహనిందితులు నికత జాకబ్​, శంతను ములుక్​తో కలిపి ప్రశ్నించారు.  ఇప్పటికే జాకబ్​, ములుక్​.. సోమవారం విచారణ ఎదుర్కొన్నారు. ద్వారకలోని ఢిల్లీ పోలీసుల సైబర్​ సెల్​ ఆఫీసులో ఇరువురినీ పోలీసులు ప్రశ్నించారు.

ఇక పర్యావరణ కార్యకర్త శంతను ముందస్తు బెయిల్​ కోసం ఢిల్లీ కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశముంది. ములుక్​ బాంబే హైకోర్టు నుంచి.. ఫిబ్రవరి 16న ట్రాన్సిట్​ బెయిల్​ పొందారు. దీనికి 10 రోజుల గడువు ఉంది.

Also Read:

అనంతపురం జిల్లాలో పెనువిషాదం.. బైక్‌పై వెళ్తుండగా విద్యుత్‌ తీగలు తెగిపడి తల్లీకుమారుడు సజీవదహనం

Bheeshma Ekadasi: నేడు భీష్మ ఏకాదశి.. ఆ పాత్రలో నటించిన ఈ టాలీవుడ్ అగ్ర హీరో ఎవరో గుర్తుపట్టండి..?