Carrymen Service: మొగుడి పోస్టుకు ఎసరు.. మార్కెట్లోకి కొత్త యాపారం! నెట్టింట పేలుతున్న జోకులు..

నేటి కాలంలో ఆలోచనలకు పదును పెడితే చిటికెలో డబ్బు సంపాదించవచ్చు. అలా పుట్టుకొచ్చిందే షాపింగ్ అసిస్టెంట్లు. వీరు ఏం చేస్తారంటే.. మీరు షాపింగ్ కు వెళ్లే మీ షాపింగ్ బ్యాగులు మోయడం, ఆహారం కోసం ఏర్పాటు చేసే క్యూలలో నిలబడటం, వినియోగదారులను మెట్రో స్టేషన్‌కు వీసుకు వెళ్లడం, వారికి కూర్చోవడానికి సీట్లు వెతకడంలో సహాయపడటం, అవసరమైనప్పుడు మడత కుర్చీలను కూడా అమర్చడం వంటివి చేస్తారు. ఇంకా..

Carrymen Service: మొగుడి పోస్టుకు ఎసరు.. మార్కెట్లోకి కొత్త యాపారం! నెట్టింట పేలుతున్న జోకులు..
Shopping Assistant Service

Updated on: May 25, 2026 | 11:47 AM

ఢిల్లీలోని లజపత్ నగర్‌కు చెందిన ఒక ప్రత్యేకమైన షాపింగ్ అసిస్టెన్స్‌ సర్వీస్‌ యాప్‌ ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది. షాపింగ్‌ చేసే వారికి తమ సంచులను మోయడానికి ఒకరిని నియమించుకునేందుకు ఈ యాప్‌ సర్వీస్‌లను అందిస్తుంది. @YesKhush_5 అనే యూజర్ Xలో షేర్ చేసిన ఈ పోస్ట్‌లో ‘CARRYMEN’ అని రాసి ఉన్న టీ-షర్టు ధరించిన ఒక వ్యక్తి చేతిలో బోలెడన్ని షాపింగ్‌ బ్యాంగులు ఉంటే.. అతడి పక్కనే రద్దీగా ఉన్న మార్కెట్‌లో నడుస్తున్న ఒక మహిళ కనిపించింది. ఈ సర్వీస్‌ కేవలం సంచులు మోయడం కంటే చాలా ఎక్కువ అందిస్తుంది. షాపింగ్‌ సమయంలో సహాయం చేయడానికి గంటకు రూ. 149 చెల్లిస్తే చాలు ఈ యాప్‌ ద్వారా ఓ వ్యక్తి వచ్చి మీ పక్కన నిలబడి మీ షాపింగ్‌ సామాగ్రి మొత్తం మోసేస్తాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆన్‌లైన్‌లో పంచుకుంటూ.. ‘లాజ్‌పత్‌లో ఇప్పుడు మీరు గంటకు రూ. 149 చెల్లిస్తే, మీ బ్యాగులు మోయడం, ఫుడ్ క్యూలలో వేచి ఉండటం, మిమ్మల్ని మెట్రో వరకు నడిపించడం, మీకు కూర్చోవడానికి చోటు వెతకడం, ఇంకా ఒక మడత కుర్చీని కూడా ఏర్పాటు చేయడం వంటి పనులు చేయించుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ బిజినెస్‌’ అంటూ సదరు యూజర్ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

ఈ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే నెట్టింట తెగ వెరల్‌ అయింది. ఇక నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో కామెంట్ సెక్షన్‌ను నింపేశారు. ‘ఇది షేర్ చేయకు యార్, అమ్మకి తెలిస్తే నా స్థానంలోకి వచ్చేస్తుంది.. అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, ఇది ఒక స్టార్టప్‌గా లేదా మిలియన్ డాలర్ల ఆలోచనగా పరిగణించబడుతుందో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు.. బహుశా ఇది అమ్ముడుపోవచ్చేమో కూడా. కానీ ఇది వనరులను దుర్వినియోగం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. మానవశక్తిని తప్పుడు దిశలో నడిపిస్తున్నట్లు అనిపిస్తుందని మరో యూజర్‌ కార్మిక సంబంధిత దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ‘ఇది చౌక కార్మిక దోపిడీ అని, అయితే శారీరక శ్రమ దోపిడీ కాదని తక్కువ జీతం ఇచ్చే, అసురక్షితమైన, అవమానకరమైన పనే దోపిడీ అని సదరు పోస్టు పెట్టిన వ్యక్తి సమాధానం ఇచ్చాడు. అసిస్టెంట్లకు సరైన జీతం చెల్లించి, వారిని గౌరవంగా చూస్తే, ఇది ఒక నిజమైన సమస్యను పరిష్కరించే చట్టబద్ధమైన సర్వీస్‌ అవుతుంది. కార్మిక నిబంధనలను విమర్శించండి, పనిని కాదు అని కాస్త గట్టిగానే బదులిచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఈ వ్యాపారం భారతదేశంలో పనిచేయదు, ఎందుకంటే ఇక్కడున్న చవకబారు ప్రజలు పాపం కూరగాయల వ్యాపారిని, పనిమనిషిని కూడా వదులుకోరు, “దీని గురించి నాన్నకు చెబితే, ‘మోసేవాళ్ళా’, వాళ్ళను ‘భర్త’ అంటారు కదా అన్నారు, మరో యూజర్‌ చమత్కరించాడు. ఇది ఒక ట్రాలీ చేసే పని కదా అని మరో యూజర్‌ తన అభిప్రాయం తెలిపాడు. ఈ ఆధునిక యాప్ ఇంటర్‌ఫేస్ అనే మాయమాటతో పేదల దోపిడీని కప్పిపుచ్చడం ద్వారా, మనం ఒక విపత్కర సమాజం వైపు పయనిస్తున్నామని ఓ యూజర్‌ ఈ బిజినెస్‌ వెనుక ఉన్న శ్రమ దోపిడీని బట్టబయలు చేశాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us