Dal Lake freezes: వామ్మో ఇదేం చలి.. భారత్‌లో ఎప్పుడూ లేని విధంగా ఓ సరస్సు పూర్తిగా గడ్డకట్టుకుపోయింది.. ఎక్కడంటే..

|

Jan 14, 2021 | 9:23 PM

Dal Lake freezes: దేశంలో ఈ ఏడాది శీతాకాలం దారుణంగా ప్రభావం చూపింది. ఉష్ణోగ్రతలు గణనీయంగ పడిపోయాయి. దాంతో యావత్ దేశ ప్రజలు..

Dal Lake freezes: వామ్మో ఇదేం చలి.. భారత్‌లో ఎప్పుడూ లేని విధంగా ఓ సరస్సు పూర్తిగా గడ్డకట్టుకుపోయింది.. ఎక్కడంటే..
Follow us on

Dal Lake freezes: దేశంలో ఈ ఏడాది శీతాకాలం దారుణంగా ప్రభావం చూపింది. ఉష్ణోగ్రతలు గణనీయంగ పడిపోయాయి. దాంతో యావత్ దేశ ప్రజలు చలికి వణికిపోయారు. దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ సహా కీలక నగరాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చలి తీవ్రంగా దేశ వ్యాప్తంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా జమ్మ కశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు నానాటికి పడిపోతున్నాయి. దాంతో అక్కడి మంచు వర్షం కురుస్తోంది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని దాల్ సరస్సు పూర్తిగా గడ్డ కట్టుకుపోయింది. అది చూసి స్థానికులు, పర్యాటకులు తెగ మురిసిపోతున్నారు. గడ్డకట్టి నదిపై అటూ ఇటూ నడుస్తూ పర్యాటకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే దాల్ సరస్సు గతంలోనూ ఇలా గడ్డకట్టినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 1991లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవగా.. ఆ సమయంలో దాల్ సరస్సు పూర్తిగా గట్టకట్టిందని వివరించారు. ఇదిలాఉండగా, శ్రీనగర్‌లో గురువారం నాడు మైనస్ 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 1991 తరువాత ఇదే అంత్యత కనిష్ట ఉష్ణోగ్రతలు అని అధికారులు చెబుతున్నారు. ఇక 1893 నుంచి ఇప్పటి వరకు శ్రీనగర్‌లో రెండుసార్లు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రికార్డుల్లో ఉంది.

TRS Party: మంత్రి కేటీఆర్‌కు కొత్త తలనొప్పి.. సిరిసిల్ల నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో నేతల మధ్య లొల్లి..

Breaking: ఈ నెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్ధిక మంత్రి..