Cyclone Jawad: మళ్లీ వర్షాలు.. దూసుకొస్తున్న ‘జవాద్‌’ తుఫాన్‌.. ఏపీ, ఒడిశా తీర ప్రాంతాలకు అలెర్ట్..

|

Dec 01, 2021 | 9:00 PM

Cyclone Jawad Effect: ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. భారీ వర్షాలతో కోస్తాఆంధ్రా, రాయలసీమలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ వరదల నుంచి తేరుకోలేదు. ఈ క్రమంలో జవాద్‌ తుఫాన్‌

Cyclone Jawad: మళ్లీ వర్షాలు.. దూసుకొస్తున్న ‘జవాద్‌’ తుఫాన్‌.. ఏపీ, ఒడిశా తీర ప్రాంతాలకు అలెర్ట్..
Cyclone Jawad
Follow us on

Cyclone Jawad Effect: ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. భారీ వర్షాలతో కోస్తాఆంధ్రా, రాయలసీమలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ వరదల నుంచి తేరుకోలేదు. ఈ క్రమంలో జవాద్‌ తుఫాన్‌ ముప్పు వణికిస్తోంది. అండమాన్‌ నికోబార్‌ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం మరో రెండు రోజుల్లో తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో ఒడిషా, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. అయితే.. ఈ సైక్లోన్‌కు దీనికి జవాద్‌ గా నామకరణం చేశారు. అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి గురువారం డిసెంబర్ 2వ తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది. ఇది మరింత బలపడి తదుపరి 24 గంటలలో మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా మారనుంది. తరువాత వాయువ్య దిశలో ప్రయాణించి మరింత బలపడుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి డిసెంబర్ 4వ తేదీ నాటికి చేరే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.

దీని ఫలితంగా ఒడిశా, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చిరించింది. ఈ తుఫాన్‌ నేపథ్యంలో ఒడిశాలోని 10 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. దీంతోపాటు కోస్తాఆంధ్రాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అల్పపీడనం రేపు వాయుగుండంగా మారి.. ఎల్లుండి తుఫాన్‌గా పరిణమించబోతున్న నేపథ్యంలో జాలర్లు సముద్రంలోకి వెళ్లొద్దని అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు పేర్కొ్నారు. తుఫాను ప్రభావంతో గంటకు 90 నుంచి 100 కీ.మీ వేగంతో గాలులు వీయడంతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. ఈ అల్పపీడనం రేపు నెల్లూరు తీరానికి 1,400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యే అవకాశముంది.

ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మరో హెచ్చరిక జారీ చేయడంతో ఆందోళన చెందుతన్నారు.

Also Read:

Bank Strik: రెండు బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల సమ్మె.. ఎప్పుడంటే..

Anchor Ravi: నా ఫ్యామిలీ జోలికి వచ్చారు.. డబ్బులిస్తే వాళ్లింట్లో వాళ్లను కూడా ట్రోల్ చేస్తారు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్..

Actor Arjun: లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరోకు క్లీన్ చిట్.. మూడేళ్ల తర్వాత అర్జున్‏కు ఊరట..