Droupadi Murmu: వామ్మో రాష్ట్రపతి నుంచి మెసేజ్.. సంబరపడుతూ ఏంటా అని ఓపెన్ చేయగా..

|

Dec 17, 2024 | 9:23 AM

ఈరోజుల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు సైబర్ నేరగాళ్లు సామన్య ప్రజలపైనే పడగా, తాజాగా దేశ రాష్ట్రపతి మీదనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుదామని యత్నించారు. కానీ చివరికి ఏం జరిగిందంటే?

Droupadi Murmu: వామ్మో రాష్ట్రపతి నుంచి మెసేజ్.. సంబరపడుతూ ఏంటా అని ఓపెన్ చేయగా..
Cyber Scammers Creates Fake
Follow us on

ఫేక్ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించి ప్రజలను మోసం చేయడం, డబ్బు వసూలు చేయడం సైబర్ స్కామర్‌లకు సర్వసాధారణం అయిపోయింది. ఇప్పటి వరకు ఈ వలలో సెలబ్రిటీలు, ఉన్నతాధికారులు పడగా, తాజాగా ఈ మోసాలు తారా స్థాయికి చేరాయి. తాజాగా సైబర్ నేరగాళ్లు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌పై ఫేక్ ఎకౌంట్లు సృష్టించారు.

ఇటీవల జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కి చెందిన సోనీ మంటూకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము‌ ప్రొఫైల్ పిక్చర్‌తో ఉన్న ఖాతా నుంచి ఓ మెసేజ్ వచ్చింది. మొదట సోనీ మంటూకి ఆ ఎకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. నేను ఫేస్‌బుక్‌ను చాలా తక్కువ వాడుతాను , నాకు మీ వాట్సాప్ నంబర్ పంపండి అంటూ సోనీ మంటూకి ఓ మెసేజ్ వచ్చింది. మంటూ తన నంబర్ అతనికి పంపాడు. కొన్ని గంటల తర్వాత, ఫేస్‌బుక్ మెసెంజర్‌లో మెసేజ్ వచ్చిందని, మీ వాట్సాప్ కోడ్‌ని వచ్చిందని, ఆ కోడ్ త్వరగా పంపించాలని సోనీ మంటూ ఆ వ్యక్తి కోరాడు. ఇది ఎదో తేడగా ఉందని గ్రహించిన సోనీ మంటూ రాష్ట్రపతి భవన్, జార్ఖండ్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ‘X’లో వివరాలను షేర్ చేశాడు.

ఈ ట్విట్ చూసిన  రాంచీ పోలీసులు వెంటనే అప్రమత్తమై ఫేస్‌బుక్ పోస్ట్‌కు స్పందించారు. సోనీ మంటూను సంప్రదించి  వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. ఎవరు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఎస్పీ రాంచీ చందన్ సిన్హా తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను పరిశీలించి సమగ్ర దర్యాప్తు చేయాలని ఏజెన్సీలను కోరామని ఆయన చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి