Corona: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు.. ఇప్పటివరకు 7కోట్ల డోసుల పంపిణీ.. ఎవరెవరికి ఇచ్చారంటే?

|

Apr 03, 2021 | 12:43 AM

India Corona Vaccination Updates: భారత్‌లో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాది

Corona: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు.. ఇప్పటివరకు 7కోట్ల డోసుల పంపిణీ.. ఎవరెవరికి ఇచ్చారంటే?
Covid Vaccination Drive
Follow us on

India Corona Vaccination Updates: భారత్‌లో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ పరంగా భారత్ మరో రికార్డును అధిగమించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏడు కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం రాత్రి వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ పరంగా భారత్ మరో మైలు రాయిని అధిగమించిందంటూ ట్విట్ చేసింది. కాగా.. వ్యాక్సినేషన్ 77 వ రోజున శుక్రవారం రాత్రి 8గంటల వరకు.. దేశవ్యాప్తంగా 12.76 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. అయితే గత 24 గంటల్లో 36.7 లక్షలకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసులను వేశారు. ఒక్కరోజులో ఇన్ని డోసులు ఇవ్వడం ఇదే మొదటిసారి. టీకా తీసుకున్న 36,71,242 మందిలో.. 33,65,597 మంది లబ్ధిదారులు మొదటి డోసు తీసుకోగా.. 3,05,645 మంది లబ్ధిదారులలు రెండో డోసు తీసుకున్నారు. 

ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలు..

ఆరోగ్య కార్యకర్తలు 89,03,809 మంది వ్యాక్సిన్ మొదటి డోసును తీసుకున్నారు. మరో 52,86,132 మంది రెండో డోసు తీసుకున్నారు.
ఫ్రంట్‌లైన్ వర్కర్లల్లో 95,15,410 మంది మొదటి డోసు తీసుకోగా.. మరో 39,75,549 మంది రెండో డోసు తీసుకున్నారు.
45 ఏళ్లు పైబడిన వారికి ఇప్పటివరకు 4,29,37,126 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
వారిలో 6,13,56,345 మంది మొదటి డోసు తీసుకున్నారు. 92,61,681 మంది రెండో డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

జనవరి 16 నుంచి దేశంలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు, ఆతర్వాత ఫ్రంట్‌లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చారు. అనంతరం మార్చి 1నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనిలో 60ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు.

హెల్త్ మినిస్ట్రీ ట్విట్..

Also Read:

Covid-19 Vaccine: ఆస్ట్రాజెనెకా టీకాపై అనుమానాలు.. గడ్డ కడుతున్న రక్తం.. బ్రిటన్‌లో వెలుగులోకి మరో 25 కేసులు

Road Accident: నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. సర్పంచ్ సహా భార్య, ఇద్దరు పిల్లలు దుర్మరణం..