India Corona: గుడ్‌న్యూస్‌.. దేశంలో తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న రికవరీలు.. నిన్న ఎన్నంటే..?

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన

India Corona: గుడ్‌న్యూస్‌.. దేశంలో తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న రికవరీలు.. నిన్న ఎన్నంటే..?
India Corona

Updated on: Nov 06, 2021 | 9:52 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన కేసులు దేశవాసులను ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి తగ్గుతున్న కేసులు కాస్త ఉపశమనం కలిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,929 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 392 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,46,950 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,44,683 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,60,265 కి చేరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా.. నిన్న కరోనా నుంచి 12,509 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,37,37,468 కి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,07,92,19,546 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.

Also Read:

Covaxin: అమెరికాలో చిన్నారులకు కోవాగ్జిన్.. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న ఆక్యూజెన్.. 

WHO: కరోనా ముప్పు ఇంకా పొంచివుంది.. ఫిబ్రవరి నాటికి యూరప్‌లో 5 లక్షల మరణాలు: డబ్ల్యూహెచ్ఓ

Follow Us