భారత్‌లో వెయ్యి దాటిన మృతుల సంఖ్య.. 31 వేలకు కరోనా పాజిటివ్ కేసులు

| Edited By:

Apr 29, 2020 | 8:59 AM

భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. పటిష్టంగా లాక్‌‌డౌన్ అమలు పరుస్తున్నా.. కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. బుధవారం ఉదయం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31 వేల మార్క్‌ని..

భారత్‌లో వెయ్యి దాటిన మృతుల సంఖ్య.. 31 వేలకు కరోనా పాజిటివ్ కేసులు
Follow us on

భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. పటిష్టంగా లాక్‌‌డౌన్ అమలు పరుస్తున్నా.. కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. బుధవారం ఉదయం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31 వేల మార్క్‌ని దాటేసింది. తాజా వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా.. 31,332 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. మృతుల సంఖ్య ఏకంగా 1007కి చేరింది. ఇక 7696 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 22,629 యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు గ్రీన్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు తెరుచుకుంటున్నాయి. మెల్లగా మళ్లీ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఆరెంజ్ జోన్లలో ఆంక్షలను చాలా వరకూ సడలించారు. అయితే హాట్‌ స్పాట్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మే 3 తరువాత ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Read More: 

తెలుగు సినిమాల గురించి ప్రత్యేకంగా భారత్ క్రికెటర్ల చర్చ

బ్రేకింగ్: గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్