Fourth Wave: ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. ఇది ఫోర్త్‌వేవ్‌కు సంకేతమా..?

|

Apr 09, 2022 | 4:55 AM

Corona Fourth Wave: దేశంలో కొత్త కరోనా కేసుల తగ్గుదల కొనసాగుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 11492 కి తగ్గింది. గత రెండు వారాలుగా కొత్త కేసుల సంఖ్య (రోజువారీ కరోనా కేసులు)..

Fourth Wave: ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. ఇది ఫోర్త్‌వేవ్‌కు సంకేతమా..?
Follow us on

Corona Fourth Wave: దేశంలో కొత్త కరోనా కేసుల తగ్గుదల కొనసాగుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 11492 కి తగ్గింది. గత రెండు వారాలుగా కొత్త కేసుల సంఖ్య (రోజువారీ కరోనా కేసులు) 1500 కంటే తక్కువగా ఉన్నాయి. ఇన్‌ఫెక్షన్ కారణంగా నానాటికీ పెరుగుతున్న పరిస్థితుల మధ్య దేశంలోని ఐదు రాష్ట్రాల్లో (Five States) కరోనా కేసులు (Corona Cases) మళ్లీ పెరగడం ప్రారంభించాయి. వీటిలో ఢిల్లీ, మహారాష్ట్ర, మిజోరం, హర్యానా, కేరళ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఇన్ఫెక్షన్ పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ అన్ని రాష్ట్రాల్లో గత వారం రోజులుగా ఇన్ఫెక్షన్ గ్రాఫ్ నిరంతరం పెరుగుతోంది. మరోవైపు విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రమాదం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు నాల్గవ వేవ్‌కు సంకేతంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

న్యూ ఢిల్లీలోని AIIMSలోని మెడిసిన్ విభాగం అదనపు ప్రొఫెసర్ డాక్టర్ నీరజ్ నిస్వాల్ మాట్లాడుతూ.. కరోనా కేసులలో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటాయి. అందువల్ల పెరుగుతున్న కేసుల ధోరణి ఆందోళనకు కారణం కాదు, కానీ కరోనా అనేది ప్రపంచవ్యాప్త అంటువ్యాధి. అటువంటి పరిస్థితిలో, ఇది మొత్తం ప్రపంచంలో నియంత్రణలోకి రాదు. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే వైరస్ నిరంతరం పరివర్తన చెందుతుంది. ఈ పరిస్థితిలో ఇది ఎప్పుడైనా కొత్త వేరియంట్‌కి మారవచ్చు. ప్రజలు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు.

త్వరలో ఫోర్త్‌వేవ్‌ వస్తుందా..?

ప్రస్తుతం దేశంలో థర్డ్‌వేవ్‌ ముగిసింది. ఇక ఫోర్త్‌వేవ్‌ రాబోతోందని ఇప్పటికే పరిశోధకులు చెప్పుకొచ్చారు. ఫోర్త్‌వేవ్‌పై డాక్టర్‌ నీరజ్‌ మాట్లాడుతూ.. కేసులు కొద్దిగా పెరుగుతున్నప్పటికీ ఇందులో భయపడాల్సిన అవసరం లేదు. ఎయిమ్స్ క్రిటికల్ కేర్ విభాగానికి చెందిన డాక్టర్ యుద్వీర్ సింగ్ మాట్లాడుతూ పెరుగుతున్న కరోనా కేసులపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతానికి ఈ రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్ గ్రాఫ్ కొన్ని రోజులు చూడవలసి ఉంటుంది. స్వల్ప హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కానీ కేసులు పెరుగుతూ ఉంటే మరింత ప్రమాదంగా ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో కరోనా మహమ్మారి కేసుల్లో స్వల్ప హెచ్చు తగ్గులు ఉన్నాయి. ప్రస్తుతానికి రాబోయే కొద్ది నెలల్లో కొత్త పెద్దగా కేసులు పెరిగే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రజలు కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండటం, మాస్క్‌లు ధరించి కోవిడ్‌ నియమాలను పాటించడం చాలా ముఖ్యం.

ఈ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి..

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఢిల్లీలో కేవలం ఎనిమిది రోజుల్లో 60 మందికి పైగా క్రియాశీల రోగులు పెరిగారు. ఇక్కడ రోజువారీ రోగుల సంఖ్య 100 కంటే తక్కువగా ఉంది. ఇది ఇప్పుడు 176 కి పెరిగింది. అలాగే కేరళలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో గురువారం 291 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి, గత 24 గంటల్లో 353 కొత్త కేసులు నమోదయ్యాయి. మిజోరంలో గత 24 గంటల్లో 123 కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం ఇక్కడ 101 కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 14 శాతం నుంచి 17కి పెరిగింది. మహారాష్ట్రలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 113 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 4న ఈ సంఖ్య 52కి చేరింది. హర్యానాలో యాక్టివ్ పేషెంట్ల సంఖ్య ఇప్పుడు 336కి పెరిగింది. కొద్ది రోజుల క్రితం 300 కంటే తక్కువ యాక్టివ్ కేసులు మిగిలి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

Corona Fourth Wave: భారత్‌లో18 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్‌ డోస్‌!.. సీరం సీఈవో ఏమన్నారంటే..

Coronavirus: కళ్లు పోడిబారిపోతున్నాయా? కరోనా లక్షణం కావచ్చట.. తాజాగా వెలుగులోకి..