దేశంలో పెరుగుతోన్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 40 వేలకుపైగా పాజిటివ్ కేసులు, 199 మరణాలు..

|

Mar 23, 2021 | 11:34 AM

Corona Cases In India: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో పలు రాష్ట్రాల్లో...

దేశంలో పెరుగుతోన్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 40 వేలకుపైగా పాజిటివ్ కేసులు, 199 మరణాలు..
Covid-19 India news
Follow us on

Corona Cases In India: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 40,715 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,16,86,796కి చేరింది. ఇందులో 3,45,377 యాక్టివ్ కేసులు ఉండగా, 1,11,81,253 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న 199 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,60,166కి చేరుకుంది. నిన్న కొత్తగా 29,785 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

కాగా, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో మునపటి కంటే భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజులో 24,645 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేరళలో 1239 కొత్త కేసులు బయటపడగా, కర్ణాటకలో 1,445 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!

జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!