Corona news: భారీగా తగ్గిన కరోనా కేసులు.. లక్షల నుంచి వంద లోపు.. ఇంతకీ ఎక్కడంటే

|

Mar 20, 2022 | 7:29 PM

దేశంలో కరోనా విజృంభించినప్పటి నుంచి అత్యంత ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర (Maharashtra). కరోనా తొలి రోజుల్లో దేశంలో నమోదయ్యే మొత్తం కేసుల్లో సగానికి పైగా కేసులు ఆ రాష్ట్రానివే. ఒక్కోసారి కేసులు లక్షకు...

Corona news: భారీగా తగ్గిన కరోనా కేసులు.. లక్షల నుంచి వంద లోపు.. ఇంతకీ ఎక్కడంటే
Corona
Follow us on

దేశంలో కరోనా విజృంభించినప్పటి నుంచి అత్యంత ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర (Maharashtra). కరోనా తొలి రోజుల్లో దేశంలో నమోదయ్యే మొత్తం కేసుల్లో సగానికి పైగా కేసులు ఆ రాష్ట్రానివే. ఒక్కోసారి కేసులు లక్షకు చేరిన రోజులూ ఉన్నాయి. ఇలా కరోనా (Corona) కోరల్లో చిక్కుకుని విలవిల్లాడిన ఆ రాష్ట్రం.. ఇప్పుడు ఆ మహమ్మారిని తరిమేసే ప్రక్రియలో అందనంత ఎత్తుకు ఎదిగింది. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం నమోదైన కేసులు వంద లోపే. ఇక మరణాల (Corona Deaths) సంఖ్య ఒక్కటే. రెండేళ్ల తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు రావడం ఇదే ప్రథమం ప్రస్తుతం దేశంలో మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతుండగా మహారాష్ట్రలో కూడా కేసులు, మరణాలు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. గత రెండేళ్లలో 78.7 లక్షల కేసులు, 1.43 లక్షల మరణాలు నమోదైన మహారాష్ట్రలో శనివారం కేవలం 97కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ముంబయిలో 29 కేసులే నమోదు కాగా.. పక్కనే ఉన్న థానే జిల్లాలో కేవలం ఆరు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒకప్పుడు కరోనా మృత్యు విలయం సృష్టించిన ముంబయిలో తాజాగా నమోదైన మరణాలు సున్నా. ఈ నెలలో అక్కడ నమోదైన మరణాలు రెండే కావడం సానుకూల అంశం.

గతంలో మహారాష్ట్రలో కరోనా కేసులు విజృంభించాయి. అనేక ప్రాంతాలను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. రాష్ట్రంలో కరోనా కేసులపై ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె.. అధికారులతో వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని ప్రాథమికంగా నిర్ధరించారు.

Also Read

Russia-Ukraine: దయ చూపని రష్యా సేనలు.. ఆకలితో అలమటిస్తున్న ఉక్రెయిన్ పౌరులు

BCCI-WSG Case: బీసీసీఐకి షాకిచ్చిన బాంబే హైకోర్టు.. ఆ కేసులో లలిత్ మోడీకి ఉపశమనం..

Women’s World Cup 2022: టీమిండియాకు సెమీ-ఫైనల్‌ ఛాన్స్.. కివీస్, ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత మారిన లక్?